లాక్ డౌన్ పై ప్రధాని మోదీ మళ్ళీ సందేశం ? ఏం చెబుతారో ?

ఈ నెల 14 న దేశవ్యాప్త లాక్ డౌన్ ఎత్తివేయాలా లేక కొనసాగించాలా అన్న విషయంపై ప్రధాని మోదీ  దేశ ప్రజలనుద్దేశించి మళ్ళీ ప్రసంగించవచ్చు. అంతకు ముందు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తిరిగి ఆయా రాష్టాల ముఖ్యమంత్రులతో మాట్లాడనున్నారు.

లాక్ డౌన్ పై ప్రధాని మోదీ మళ్ళీ సందేశం ? ఏం చెబుతారో ?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 10, 2020 | 11:22 AM

ఈ నెల 14 న దేశవ్యాప్త లాక్ డౌన్ ఎత్తివేయాలా లేక కొనసాగించాలా అన్న విషయంపై ప్రధాని మోదీ  దేశ ప్రజలనుద్దేశించి మళ్ళీ ప్రసంగించవచ్చు. అంతకు ముందు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తిరిగి ఆయా రాష్టాల ముఖ్యమంత్రులతో మాట్లాడనున్నారు. లాక్ డౌన్ ని కేంద్రం పొడిగించవచ్చునని, అయితే ఈ సారి పలు మార్పులు చేస్తారని తెలుస్తోంది. అత్యవసర సర్వీసులు  తప్ప అంతర్ రాష్ట్ర మూవ్ మెంట్ పై ఆంక్షలు కొనసాగవచ్ఛు నని అంటున్నారు. విద్యా సంస్థల మూసివేత మరికొన్ని వారాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. లాక్ డౌన్ కారణంగా ముఖ్యంగా ఆర్థిక రంగం కుదేలయింది. ఈ నేపథ్యంలో ఈ రంగాన్నితిరిగి గాడిన పెట్టేందుకు కొన్ని రంగాలకు సడలింపునిస్తారని సమాచారం. ముఖ్యంగా పౌర విమాన యానరంగం తీవ్రంగా నష్టపోయింది. అందువల్ల ఎయిర్ లైన్స్ ని పునరుధ్ధరించవచ్ఛునని, విమానాల్లో మధ్య సీటును ఖాళీగా ఉంచాలన్న నిబంధన విధించవచ్చునని అంటున్నారు. అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ ని పొడిగించాలని కోరుతున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు దశల వారీగా ఎత్తివేయాలని అభ్యర్థిస్తున్నాయి.