మూడో విడత జన్‌ధన్ నిధులు..నెంబర్ల వారిగా నగదు విత్‌డ్రాలు

ఇప్పటికే రెండు విడతల్లో రూ.1,000 ట్రాన్స్‌ఫర్ చేసిన ఎస్‌బీఐ... మూడో విడత డబ్బు జమ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు..జన్‌ధన్ ఖాతాలు కలిగిన వారందరికీ..

మూడో విడత జన్‌ధన్ నిధులు..నెంబర్ల వారిగా నగదు విత్‌డ్రాలు
Follow us

|

Updated on: Jun 03, 2020 | 2:06 PM

కరోనా వైరస్ ప్రభావంతో దేశప్రజలు ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మర సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్యాకేజీ ద్వారా నిరుపేద మహిళలకు నెలకు రూ.5 వందల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నారు. జన్ ధన్ అకౌంట్లు ఉన్న 20 కోట్ల మహిళలకు నెలకు 500 చొప్పున మూడు నెలల వరకు ఇస్తామని ప్రకటించిన కేంద్రం..ఇప్పటికే రెండు విడతల నగదు బదిలీ చేసింది. ప్రస్తుతం మూడో విడత డబ్బులు అందజేసేందుకు కసరత్తు మొదలైంది.

ఇప్పటికే రెండు విడతల్లో రూ.1,000 ట్రాన్స్‌ఫర్ చేసిన ఎస్‌బీఐ… మూడో విడత డబ్బు జమ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు..జన్‌ధన్ ఖాతాలు కలిగిన వారందరికీ జూన్ 5న నగదు ట్రాన్స్‌ఫర్ మొదలవుతుందని..జూన్ 10 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించింది. డబ్బు విత్‌డ్రా కోసం ఖాతాదారులు ఏటీఎంల వద్ద గుమిగూడే అవకాశం ఉందని భావించిన కేంద్రప్రభుత్వం 5 రోజులు, 5 విడతల్లో నగదు బదిలీ చేయనుంది. ఇక లబ్ధిదారులు ఏటీఎంలు, బ్యాంకు మిత్రాలు, సీఎస్పీల దగ్గర ఎప్పుడైనా డబ్బులు డ్రా చేసుకునే వెసులు బాటును కల్పించింది.

అకౌంట్ నెంబర్ల వారిగా ఐదు రోజులు నగదు బదిలీకి సంబంధించి వివరాలు.. – జూన్ 5- అకౌంట్ నెంబర్‌ చివర్లో 0 లేదా 1 నెంబర్ ఉన్నవారికి – జూన్ 6- అకౌంట్ నెంబర్‌ చివర్లో 2 లేదా 3 నెంబర్ ఉన్నవారికి – జూన్ 8- అకౌంట్ నెంబర్‌ చివర్లో 4 లేదా 5 నెంబర్ ఉన్నవారికి – జూన్ 9- అకౌంట్ నెంబర్‌ చివర్లో 6 లేదా 7 నెంబర్ ఉన్నవారికి – జూన్ 10- అకౌంట్ నెంబర్‌ చివర్లో 8 లేదా 9 నెంబర్ ఉన్నవారికి