‘టాలెంట్ ఉన్న శక్తిమంతుడు’..రిషి కపూర్ మృతిపై మోదీ సంతాపం

బాలీవుడ్ నటుడు రిషికపూర్ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రిషిని 'అద్భుతమైన టాలెంట్ ఉన్న శక్తిమంతుడిగా' అభివర్ణించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి రిషితో తాను జరిపిన ఇంటరాక్షన్ లనుఆయన గుర్తు చేసుకున్నారు.

'టాలెంట్ ఉన్న శక్తిమంతుడు'..రిషి కపూర్ మృతిపై మోదీ సంతాపం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 30, 2020 | 12:58 PM

బాలీవుడ్ నటుడు రిషికపూర్ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రిషిని ‘అద్భుతమైన టాలెంట్ ఉన్న శక్తిమంతుడిగా’ అభివర్ణించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి రిషితో తాను జరిపిన ఇంటరాక్షన్ లనుఆయన గుర్తు చేసుకున్నారు. సోషల్ మీడియాలో సైతం తాము ఒకరితో ఒకరు కాంటాక్ట్ చేసుకునేవారమని ఆయన పేర్కొన్నారు. మూవీలే తన ప్రాణమని చెప్పే రిషి… ఈ దేశ అభ్యున్నతికి తన వంతు కృషి చేశారన్నారు.

ఆటు-ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా రిషికపూర్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు. సినిమాల్లో అత్యద్భుతమైన పాత్రలు పోషించి.. రొమాంటిక్ హీరోగా పాపులర్ అయిన రిషి మృతితో ఈ దేశం అత్యంత అఫుడైన కొడుకును, చిత్ర సీమ ఒక ఆణిముత్యాన్ని కోల్పోయిందని ఆయన ట్వీట్ చేశారు.