బైక్‌పై గొడుగుతో ప్రయాణిస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త…!

బైక్‌పై వెళ్లేటప్పడు ఎండ నుంచి, వర్షం నుంచి రక్షణ కోసం గొడుగులు ఉపయోగిస్తూ ఉంటారు. వాహనానికి ఫిక్స్ చేసి ఉండే..ప్లాస్టిక్ గొడుగులతో ప్రాబ్లం లేదు కానీ..రెగ్యూలర్‌గా మనం ఉపయోగించే గొడుగును తీసుకెళ్లారో తస్మాత్ జాగ్రత్త. మన ఊహకు కూడా అందని ప్రమాదాలు వీటి వల్ల జరిగే ప్రమాదం ఉంది. మాములుగా మనం వర్షం పడుతున్నప్పుడు సైతం..గాలి దిశను బట్టి గొడుగును తిప్పుతూ ఉండాలి. లేకపోతే దాని ఫోర్స్‌ను తట్టుకోవడం కష్టం. ఇక బైక్‌పై వెళ్తున్నప్పుడు గాలి ఎటువైసు […]

బైక్‌పై గొడుగుతో ప్రయాణిస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త...!
Follow us

|

Updated on: Dec 22, 2019 | 6:08 AM

బైక్‌పై వెళ్లేటప్పడు ఎండ నుంచి, వర్షం నుంచి రక్షణ కోసం గొడుగులు ఉపయోగిస్తూ ఉంటారు. వాహనానికి ఫిక్స్ చేసి ఉండే..ప్లాస్టిక్ గొడుగులతో ప్రాబ్లం లేదు కానీ..రెగ్యూలర్‌గా మనం ఉపయోగించే గొడుగును తీసుకెళ్లారో తస్మాత్ జాగ్రత్త. మన ఊహకు కూడా అందని ప్రమాదాలు వీటి వల్ల జరిగే ప్రమాదం ఉంది.

మాములుగా మనం వర్షం పడుతున్నప్పుడు సైతం..గాలి దిశను బట్టి గొడుగును తిప్పుతూ ఉండాలి. లేకపోతే దాని ఫోర్స్‌ను తట్టుకోవడం కష్టం. ఇక బైక్‌పై వెళ్తున్నప్పుడు గాలి ఎటువైసు వీస్తుందో చెప్పలేం. అనుకూలంగా ఉన్నవైపు కాకుండా వేరే డైరెక్షన్‌లో దాన్ని ఓపెన్ చేస్తే..ఇదిగో ఈ దిగువ చూపించినటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

ఈ వీడియోను రాచకొండ పొలీస్‌ కమిషనర్‌ మహేశ్ భగవత్‌ ట్విటర్‌‌లో పోస్ట్‌ చేశారు. అందులో ఓ మహిళ బైక్‌పై వెనుక కూర్చుని గొడుగుతో ప్రయాణిస్తుంది. మధ్యలో దాన్ని ఒకచేతి నుంచి మరో చేతిలోకి మార్చుకోడానికి ప్రయత్నించింది. దీంతో గాలి ఫోర్స్‌కు ఒక్కసారిగా గొడుగుతో పాటే వెళ్లి కిందపడింది. ఈ వీడియోను షేర్ చేసిన మహేశ్‌ భగవత్‌.. ‘బైక్‌పై ప్రయాణించేటప్పుడు గొడుగు తెరవకండి’ అంటూ వాహనదారులను సూచించారు.