నదుల కలుషితానికి ప్రధాన కారకాలు అవే

దైనందిన జీవితంలో నీటి ప్రాధాన్యత చాలా ఉంటుంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వారు నీరు లేకుండా చాలా పనులు జరగవు. అయితే గ్లోబలైజేషన్ కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా నీటి ఎద్దడి పెరిగిపోతుండగా.. మరోవైపు కాలుష్యం నీటి వనరులపై చాలా ప్రభావాన్ని చూపుతోంది. నీటి కాలుష్యం వలన కేవలం మనుషులే కాదు జలజీవరాశులు కూడా పెద్ద ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే నీటి వనరులు కలుషితం అయ్యేందుకు మొదటి కారణం ప్లాస్టిక్ అని పరిశోధకులు స్పష్టం […]

నదుల కలుషితానికి ప్రధాన కారకాలు అవే
Follow us

| Edited By:

Updated on: Apr 09, 2019 | 4:51 PM

దైనందిన జీవితంలో నీటి ప్రాధాన్యత చాలా ఉంటుంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వారు నీరు లేకుండా చాలా పనులు జరగవు. అయితే గ్లోబలైజేషన్ కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా నీటి ఎద్దడి పెరిగిపోతుండగా.. మరోవైపు కాలుష్యం నీటి వనరులపై చాలా ప్రభావాన్ని చూపుతోంది. నీటి కాలుష్యం వలన కేవలం మనుషులే కాదు జలజీవరాశులు కూడా పెద్ద ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే నీటి వనరులు కలుషితం అయ్యేందుకు మొదటి కారణం ప్లాస్టిక్ అని పరిశోధకులు స్పష్టం చేశారు.

యూకే, యూరప్‌లోని తొమ్మిది మంచి నీటి నదులపై ఎర్త్‌వాచ్ ఇనిస్టిట్యూట్, ప్లాస్టిక్ ఓషియన్స్ యూకే సంస్థలు ఇటీవల పరిశోధనలు చేశాయి. వారి పరిశోధనల్లో నీరు కలుషితం అవ్వడానికి ప్లాస్టిక్ బాటిల్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని తేలింది. అలాగే ఆహార పాకెట్లు, సిగరెట్ వ్యర్థాలు కూడా నీటిని కలుషితం చేస్తున్నాయని వారు వెల్లడించారు. ప్లాస్టిక్‌ను తగ్గించడం వలన నీటి కాలుష్యాన్ని చాలా మేరకు అరికట్టవచ్చని వారు పేర్కొన్నారు.

ప్రతి మనిషి ఒక సంవత్సరం కాలంలో దాదాపుగా 150 వాటర్ బాటిల్స్‌ను వాడుతున్నారని పరిశోధకులు వెల్లడించారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరు రీయూజబుల్ బాటిల్స్‌ను వాడటం అలవాటు చేసుకోవాలని వారు చెప్పారు. అలా చేసినట్లైతే నదుల కాలుష్యంతో పాటు భూ కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చని వారు చెప్పుకొచ్చారు.