కర్నూల్‌లో ప్లాస్మా థెరపీ ప్రారంభించిన డాక్టర్లు

రాష్ట్రంలో కర్నూల్‌లో మొదటిసారిగా కరోనా బాధితునికి ప్లాస్మా థెరపీని ప్రారంభించారు. శుక్రవారం రాత్రి డోన్‌కి చెందిన ఓ వ్యక్తికి క్లినికల్ ట్రయల్స్ కింద వైద్యులు ప్లాస్మా థెరపీని అందించారు.

కర్నూల్‌లో ప్లాస్మా థెరపీ ప్రారంభించిన డాక్టర్లు
Follow us

| Edited By:

Updated on: Jul 12, 2020 | 1:42 PM

రాష్ట్రంలో కర్నూల్‌లో మొదటిసారిగా కరోనా బాధితునికి ప్లాస్మా థెరపీని ప్రారంభించారు. శుక్రవారం రాత్రి డోన్‌కి చెందిన ఓ వ్యక్తికి క్లినికల్ ట్రయల్స్ కింద వైద్యులు ప్లాస్మా థెరపీని అందించారు. అయితే రాష్ట్రంలో తొలిసారిగా తిరుపతిలో ఓ వ్యక్తికి ప్లాస్మా థెరపీని అందించగా.. తాజాగా కర్నూల్‌లో ఓ బాధితుడికి ప్లాస్మాను ఎక్కించారు.

కాగా కరోనా బాధితులు త్వరగా కోలుకునేందుకు ప్లాస్మా థెరపీని చేస్తున్నారు. ఈ ప్రక్రియలో కరోనా నుంచి కోలుకున్న వారి నుంచి ప్లాస్మాను సేకరించి, కోవిడ్ బాధితులకు దాన్ని ఎక్కించనున్నారు. ఈ చికిత్స వలన దేశంలో చాలా మంది కోలుకున్నారు (కొన్ని చోట్ల మరణాలు సంభవించాయి. అయినప్పటికీ కోలుకున్న వారి సంఖ్య అధికంగా ఉండటంతో ప్లాస్మా థెరపీ చేసేందుకు ఐసీఎంఆర్‌ అనుమతిని ఇస్తోంది). ఈ క్రమంలో ప్లాస్మాను దానం చేయాలంటూ సచిన్‌ సహా పలువురు సెలబ్రిటీలు పిలుపును ఇస్తున్నారు. ఇక ఢిల్లీలో ప్లాస్మా బ్యాంక్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.