ఆరోగ్యశ్రీ వారికీ వర్తిస్తుంది.. రివ్యూ మీటింగ్‌లో ఏపీ సీఎం

Jagan Meeting with officers

ఏపీ సీఎం వైఎస్ జగన్ వైద్య, ఆరోగ్యశాఖల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ సేవలపై మాట్లాడారు. రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారిందరికీ ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని . ఆరోగ్య శ్రీ ద్వారా సుమారు సుమారు కోటిన్నర మందికి లబ్ధి చేకూరుతుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. డిసెంబర్‌ 21 నుంచి కార్డుల జారీ ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికీ హెల్త్‌ కార్డు, క్యూఆర్‌ కోడ్‌తో కార్డుల జారీ చేస్తామని. కార్డు స్కాన్‌ చేయగానే ఆ కార్డుదారునికి ఓటీపీ నంబర్‌ వస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. కుటుంబ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతాయని, ఈ విధానంతో ఎవరైనా ఆస్పత్రికి వెళ్లినప్పుడు ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ఏంటనేది వైద్యులకు సులభంగా అర్ధం చేసుకోవడానికి వీలుంటుందన్నారు. అదే సమయంలో ఆ వ్యక్తి ఆరోగ్య వివరాలన్నీ గోప్యంగా ఉంచబడతాయని సీఎం వివరించారు.

వీటన్నితో పాటు ఆపదలో ఉన్నవానికి వెంటనే ఆదుకునే 108 వాహనాలు ఎప్పడు మంచి కండిషన్‌లో ఉంచాలని, కనీసం ఆరేళ్లకు ఒకసారి వాహనాలను మార్చాలన్నారు. కొత్తగా వెయ్యి వాహనాలు కొనుగోలు చేస్తున్నామని చెప్పారు సీఎం జగన్. ఇక 104 సేవలపై మాట్లాడుతూ ఈ వాహనాల ద్వారా ఆరోగ్యపరీక్షలు నిర్వహించి అత్యవసర చికిత్స అందించాలని ఆదేశించారు.

రాష్ట్రంలో ఐదు క్యాన్సర్‌ ఆస్పత్రులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తెలిపారు. కడప , విశాఖ, గుంటూరు, కర్నూలు, తిరుపతిలలో క్యాన్సర్‌ ఆస్పత్రులను నిర్మిస్తామని, ప్రకాశం జిల్లాలో కిడ్నీ సూపర్‌ స్పెషాలిటీ రీసెర్చ్‌ ఆస్పత్రి, పాడేరు, విజయనగరం, గురజాలలో మెడికల్‌ కాలేజీలు స్థాపిస్తామని ఆయన వెల్లడించారు. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో వీటికి శంకుస్థాపనలు చేయబోతున్నట్టు సీఎం జగన్ తెలిపారు.

Jagan Meeting officers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *