వాట్సాప్‌కి ప్రత్యామ్నాయంగా మరో యాప్

Whatsapp, వాట్సాప్‌కి ప్రత్యామ్నాయంగా మరో యాప్

ప్రతిదానికి అమెరికాపై ఆధారపడకూడదని నిర్ణయించింది కేంద్రం. ఇప్పటి వరకు అమెరికాతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆధారపడాల్సి వస్తూనే ఉంది. ప్రపంచ దేశాల్లో పెద్దన పాత్ర పోషిస్తున్న అమెరికాకు ఎదురుచెప్పలేని పరిస్థితి. ఇప్పటికే చైనా,ఇరాన్‌తో వాణిజ్య పరమైన ఆంక్షలతో వణుకు పుట్టిస్తున్న అమెరికాతో మనకు ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవని భావిస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో ఫేస్‌బుక్,ట్విట్టర్‌,కంటే వాట్సాప్‌ మీదే జనం బాగా ఆధారపడ్డారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా వాట్సాప్‌నే నమ్ముకుంది. ఒకవేళ అమెరికాతో మనకు సంబంధాలు చెడితే పరిస్థితి ఏంటీ అనే ఆలోచనలో పడింది కేంద్రం. దీనిపై సీరియస్‌ ఆలోచించిన  కేంద్రం వాట్సాప్‌కి ప్రత్యామ్నాయంగా అలాంటి యాప్‌ను రెడీ చేయాలని భావిస్తోంది.

ప్రభుత్వం రెడీ చేయబోతున్న ఈ యాప్‌ ద్వారానే అధికారిక సందేశాన్నీ షేర్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం దీనినుంచి ఎలాంటి డేటా చౌర్యం కాకుండా ఉండేలా పటిష్టంగా తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నారు. అదే విధంగా వాట్సాప్‌లో ఉన్న ఫీచర్స్‌లాగే దీన్ని కూడా తయారు చేయాలని భావిస్తున్నారు.

అయితే ఇప్పటికే ఇలాంటి యాప్‌నే తయారు చేసింది ఫ్రాన్స్ దాని పేరు టి చాప్(T chap). అయితే దీనిలో ఉన్న డేటా లీక్ కావడంతో అది ఫెయిల్ అయ్యింది. ఫ్రాన్స్‌లో జరిగిన అనుభవాన్ని బట్టి మనదేశం తయారుచేసే యాప్‌ను పటిష్టంగా రూపొందించాలని భావిస్తోంది ప్రభుత్వం. వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా భారత్ తయారుచేసే యాప్ అందుబాటులోకి వస్తే నిజంగా మేకిన్ ఇండియాకు నిజమైన అర్ధం చెప్పినట్టువుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *