ఆ12 రహదారులను మరిచిపోయారా.. ఇందుకోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ చూపాలంటున్న..

తెలంగాణ రాష్ట్రానికి జాతీయ రహదారుల విషయంలో జరిగిన అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్

ఆ12 రహదారులను మరిచిపోయారా.. ఇందుకోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ చూపాలంటున్న..
Follow us

|

Updated on: Dec 19, 2020 | 5:36 AM

తెలంగాణ రాష్ట్రానికి జాతీయ రహదారుల విషయంలో జరిగిన అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణ రాష్ట్రానికి 25 జాతీయ రహదారుల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇవ్వగా, అందులో 13 జాతీయ రహదారులను మాత్రమే మంజూరు చేశారని, మిగతా12 జాతీయ రహదారులను కూడా వెంటనే మంజూరు చేయాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కి లేఖ రాశారు.

తాను ఎంపీ గా ఉన్నప్పుడు (2014-19) టీఆర్ఎస్ ఎంపీలం అనేక సార్లు జాతీయ రహదారుల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి గడ్కరీ ని కలిసి విజ్ఞప్తి చేశామని గుర్తుచేశారు. రాష్ట్రానికి 25 జాతీయ రహదారుల ను మంజూరు చేయాలని కోరగా అందులో 13 రహదారులకు మంజూరులు ఇచ్చారని, మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు పనులేవీ ప్రారంభం కాలేదని వినోద్ కుమార్ లేఖలో పేర్కొన్నారు. మంజూరైన జాతీయ రహదారులకు నంబర్లు కూడా ఇచ్చారని, కానీ పనులు ప్రారంభించడం విషయం కేంద్ర ప్రభుత్వం మరిచి పోయిందని అన్నారు. ఈ జాతీయ రహదారుల పనులను తక్షణమే ప్రారంభించాలన్నారు. పెండింగ్ లో ఉన్న మిగతా 12 జాతీయ రహదారులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన జాతీయ రహదారుల పనులు ఇటీవలే పూర్తి కావడంతో ఆ జాతీయ రహదారులను ఈనెల 21 న కేంద్ర మంత్రి గడ్కరీ ప్రారంభించనుండటం సంతోషకరమని పేర్కొన్నారు. ఇప్పటికే మంజూరైన జాతీయ రహదారుల పనులను ప్రారంభించడానికి, పెండింగులో ఉన్న మిగతా 12 జాతీయ రహదారుల మంజూరు విషయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ. కిషన్ రెడ్డి చొరవ చూపాలని వినోద్ కుమార్ సూచించారు. జాతీయ రహదారుల నిర్మాణం కోసం అవసరమైన భూములను ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.

238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ
238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్