బ్రేకింగ్: ఘోర విమాన ప్రమాదం.. 9మంది మృతి

కజకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. టేకాఫ్ తీసుకునే సమయంలో అదుపుతప్పిన ఆ విమానం బిల్డింగ్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మృతి చెందినట్లు తెలుస్తోంది. మరికొంత మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటన సమయంలో విమానంలో 5మంది విమాన సిబ్బంది సహా 100మంది ఉన్నారు. కజకిస్తాన్‌లోని అతిపెద్ద విమానాశ్రయం ఆల్‌మటీ నుంచి రాజధాని నుర్-సుల్తాన్‌కు వెళ్లే సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకున్న […]

బ్రేకింగ్: ఘోర విమాన ప్రమాదం.. 9మంది మృతి
Follow us

| Edited By:

Updated on: Dec 27, 2019 | 9:55 AM

కజకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. టేకాఫ్ తీసుకునే సమయంలో అదుపుతప్పిన ఆ విమానం బిల్డింగ్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మృతి చెందినట్లు తెలుస్తోంది. మరికొంత మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటన సమయంలో విమానంలో 5మంది విమాన సిబ్బంది సహా 100మంది ఉన్నారు. కజకిస్తాన్‌లోని అతిపెద్ద విమానాశ్రయం ఆల్‌మటీ నుంచి రాజధాని నుర్-సుల్తాన్‌కు వెళ్లే సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, విమాన సిబ్బంది తదితరులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.