షాకింగ్.. రన్‌వేపై అదుపుతప్పి.. మూడు ముక్కలైన విమానం.. చివరకు..

టర్కీలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనలో ప్రాణనష్టం వాటిల్లకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. జరిగిన ప్రమాద ఘటన చూసిన వారంతా షాక్ తింటున్నారు. దానికి అసలు కారణం.. ఆ విమానం మూడు ముక్కలవ్వడం. వివరాల్లోకి వెళితే…ఇస్తాంబుల్ సిటీలో సబీహ విమానాశ్రయంలో పెగాగస్‌ ఎయిర్‌లైన్‌ సంస్థకు చెందిన విమానం.. ల్యాండింగ్ అయ్యే క్రమంలో అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో విమానం మూడు ముక్కలుగా విరిగిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో.. […]

షాకింగ్.. రన్‌వేపై అదుపుతప్పి.. మూడు ముక్కలైన విమానం.. చివరకు..
Follow us

| Edited By:

Updated on: Feb 06, 2020 | 9:28 AM

టర్కీలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనలో ప్రాణనష్టం వాటిల్లకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. జరిగిన ప్రమాద ఘటన చూసిన వారంతా షాక్ తింటున్నారు. దానికి అసలు కారణం.. ఆ విమానం మూడు ముక్కలవ్వడం. వివరాల్లోకి వెళితే…ఇస్తాంబుల్ సిటీలో సబీహ విమానాశ్రయంలో పెగాగస్‌ ఎయిర్‌లైన్‌ సంస్థకు చెందిన విమానం.. ల్యాండింగ్ అయ్యే క్రమంలో అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో విమానం మూడు ముక్కలుగా విరిగిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో.. దాదాపు 177 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే వీరంతా సేఫ్‌గానే ఉన్నారని తెలిపారు.

అయితే 23 మందికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన విమానం పెగాసస్ ఎయిర్‌లైన్స్‌కి చెందినదిగా గుర్తించారు. విమానం కిందపడిపోయిన వెంటనే మంటలు చెలరేగాయని.. వెంటనే రంగంలోకి దిగిన ఎయిర్‌పోర్టు సిబ్బంది మంటలను అదుపు చేశారని అధికారులు తెలిపారు. లేని పక్షంలో భారీగా ప్రాణనష్టం జరిగేదని అధికారులు అభిప్రాయపడ్డారు. విమాన ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.