IPL 2020 : ఢిల్లీకి షాక్, వారం పాటు పంత్ దూరం !

యూఏఈ వేదికగా జరుగుతోన్న ఐపీఎల్-2020 సీజన్‌లో ఢిల్లీ కేపిటల్స్ తిరుగులేని విజయాలతో దూసుకెళ్తోంది. శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్, అజింక్య రహానె, కగిసో రబడ, మార్కస్ స్టోయినిస్ వంటి....

IPL 2020 : ఢిల్లీకి షాక్, వారం పాటు పంత్ దూరం !
Follow us

|

Updated on: Oct 12, 2020 | 6:16 PM

యూఏఈ వేదికగా జరుగుతోన్న ఐపీఎల్-2020 సీజన్‌లో ఢిల్లీ కేపిటల్స్ తిరుగులేని విజయాలతో దూసుకెళ్తోంది. శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్, అజింక్య రహానె, కగిసో రబడ, మార్కస్ స్టోయినిస్ వంటి స్టార్ ప్లేయర్లు నిండి ఉన్న ఢిల్లీ కేపిటల్స్.. వరుసగా మూడు విజయాల తరువాత ముంబై చేతిలో పరాజయం చవిచూసింది. దీంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పడిపోయింది. ఈ మ్యాచ్‌లో రిషభ్ పంత్ ఆడకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌ను చివరి నిమిషంలో ఫైనల్ టీమ్‌లోకి తీసుకోలేదు. అతని ప్లేసులో అజింక్య రహానేను తీసుకున్నారు.  నిలకడ ప్రదర్శించనప్పటికీ.. ఈ టోర్నమెంట్‌లో రిషభ్ పంత్ భారీ షాట్లను ఆడుతున్నాడు.ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచుల్లో 176 రన్స్ చేశాడు. 38 అతని వ్యక్తిగత టాప్ స్కోర్. 133 స్ట్రైక్ రేట్‌తో 35.20 బ్యాటింగ్ యావరేజ్‌తో ఓ మాదిరిగా నెట్టుకొస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో అనూహ్యంగా అతడు డగౌట్‌కు పరిమితం అయ్యాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్ స్థానంలో ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ కీపింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌కే కాదు.. మరో రెండు మ్యాచ్‌లకు కూడా అతను అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. ( పిల్లి పిల్ల‌ అనుకుని కొన్నారు..తీరా రెండేళ్ల తర్వాత..! )

ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం రిషభ్‌ను తప్పించడానికి గల కారణాన్ని కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తెలిపాడు. వారం రోజుల పాటు అతనికి రెస్ట్ అవసరమైందని పేర్కొన్నాడు. డాక్టర్ల సలహా మేరకు రిషబ్ పంత్‌కు వారం రోజుల పాటు విశ్రాంతి ఇచ్చినట్లు వివరించాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా పంత్ గాయపడ్డాడని, ఆ గాయం నుంచి ఇంకా కోలుకోలేదని చెప్పాడు. రిషభ్ పంత్ లేకపోవడం బ్యాటింగ్‌లో లైనప్ బలహీనపడుతుందని, దాన్ని భర్తీ చేయడానికి తమ వద్ద అస్త్రాలు ఉన్నాయని తెలిపాడు అయ్యర్.

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?