Breaking News
  • విజయవాడ: టీడీపీ ప్రభుత్వం ఆర్టీసీ, విద్యుత్‌ చార్జీలు పెంచలేదు. ఆర్టీసీ చార్జీల పెంపుతో ప్రజలపై రూ.3,500 కోట్ల భారం పడుతుంది. వైసీపీ చేతగాని తనంతోనే ప్రజలపై భారం మోపారు -మాజీ మంత్రి దేవినేని ఉమ. ఐదు నెలలు ఇసుక దొరకకుండా దోచుకున్నారు. ఇప్పుడు ఆర్టీసీ చార్జీల పెంపుతో ప్రజలపై భారం మోపారు -మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.
  • విజయవాడ: భవానీ దీక్ష విరమణల కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ నెల 18 నుంచి 22 వరకు ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షా విరమణలు. కనకదుర్గానగర్‌ మీదుగా భక్తులను ఆహ్వానిస్తున్నాం. భవానీల కోసం ఘాట్‌ రోడ్డు మీదుగా క్యూలైన్‌లు ఏర్పాటు చేశాం. ఇంద్రకీలాద్రిపై ప్లాస్టిక్‌ను నిషేధించాం-ఈవో సురేష్‌ బాబు.
  • చెన్నై: స్థానిక సంస్థల ఎన్నికలకు రజినీ మక్కల్‌ మండ్రం దూరం. ఏ పార్టీకి మద్దతు ప్రకటించని మండ్రం. రజినీ మద్దతు ఇస్తున్నట్టు ఎవరైనా ప్రచారం చేసుకుంటే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక.
  • నెల్లూరు: వైసీపీ ప్రభుత్వం మాట తప్పింది-కోటంరెడ్డి . ప్రజలపై ఏ భారం వేయబోము అని నమ్మించి అధికారంలోకి వచ్చారు. ఆర్టీసీ చార్జీల పెంపుతో ఏటా రూ.700 కోట్ల భారం ప్రజలపై పడింది. మాట తప్పని జగన్‌ ఆర్టీసీ చార్జీల పెంపుపై సమాధానం చెప్పాలి. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కాపీ కొడుతూ జగన్‌ కాపీ సీఎంగా మారారు -నూడా మాజీ చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి.
  • భవానీని కన్న తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. కన్న తల్లిదండ్రులకు ఎలాంటి డీఎన్‌ఏ అక్కర్లేదన్న పోలీసులు. కన్న తల్లిదండ్రుల దగ్గర అన్ని ఆధారాలున్నాయి. ఇరు కుటుంబాలు తమ అనుమానాలను మా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ల అనుమానాలను నివృత్తి చేశాం-పోలీసులు. భవానీ కన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు అంగీకరించింది. ఇరువురు ఒప్పుకోవడంతో కన్నవారికే అప్పగించాం-పోలీసులు.
  • తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర అగ్నిప్రమాదం. శ్రీవారి ఆలయం వెలుపల ఉన్న బూందీ తయారీ పోటులో మంటలు. మంటలార్పుతున్న ఫైర్‌ సిబ్బంది.
  • అమరావతి: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. వాడీవేడిగా జరగనున్న సమావేశాలు. ఉల్లి, నిత్యావసరాల ధరల పెరుగుదలపై.. రేపు అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇవ్వనున్న టీడీపీ. ఉల్లి ధరల పెరుగుదలపై టీడీపీ నిరసన. అసెంబ్లీ గేట్‌ నుంచి ఉల్లిపాయల దండలతో.. అసెంబ్లీకి వెళ్లనున్న టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.

పింక్ టెస్ట్ : ఈడెన్‌లో సీనియర్ల సందడి..

India vs Bangladesh: Latest News on Pink Test, పింక్ టెస్ట్ : ఈడెన్‌లో సీనియర్ల సందడి..

పొట్టి క్రికెట్ వచ్చాక కష్టాల్లో కూరుకుపోయిన టెస్ట్ క్రికెట్ స్థాయి పెంచాలన్న సంకల్పంతో 2015లో డే అండ్ నైట్ టెస్టులకు ఐసీసీ అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు డే/నైట్ టెస్టులు ఆడేందుకు భారత్ టీం ఇంట్రస్ట్  చూపించలేదు. కానీ గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్ అయ్యాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పింక్ టెస్ట్ ఆడాలని దాదా ప్రతిపాదించడం..అందుకు సారథి కోహ్లీ యస్ అనడం చకచకా జరిగిపోయాయి. అందుకు దాదా ఆధ్వర్యంలో ఏర్పాట్లు కూడా భారీగా జరిగాయి. కోల్‌కతా సిటీ మొత్తం పింక్ కలర్ సంతరించుకుంది.

అనుకున్న రోజు రానే వచ్చింది. పింక్ బాల్‌తో ఈడెన్‌లో మ్యాచ్ ప్రారంభమైంది. టీం ఇండియా తొలిసారిగా బంగ్లాదేశ్‌తో డే అండ్‌ నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు ఈడెన్ గ్రౌండ్‌లోకి దిగింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ సారథి మొమినల్ హఖ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పింక్ బంతితో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. 60 పరుగులకే బంగ్లా జట్టు 6 వికెట్లు కొల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. లంచ్ బ్రేక్ ప్రకటించేసరికి బంగ్లాదేశ్ స్కోరు 73/6 . అయితే లంచ్ బ్రేక్ సమయంలో ఇండియన్ క్రికెట్ లెజెండ్స్‌ ద్రవిడ్, గంగూలీ, సచిన్, లక్ష్మణ్‌లతో గ్రౌండ్‌లో ఓ చిన్న టాక్ షో ప్లాన్ చేసింది క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్.

అయితే మ్యాచ్ హాజరైన ద్రవిడ్, గంగూలీ గ్రౌండ్‌లోకి మాత్రం రాలేదు. ఎందుకంటే గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్‌గా, ద్రవిడ్ భారత ‘ఏ’ టీం కోచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వారు కాస్త దూరంగా ఉండిపోయారు. ఇక వారి ప్లేసుల్లో కుంబ్లే, హర్బజన్ రంగంలోకి దిగారు. మాజీ క్రికెటర్ల సరదా సంభాషణలు క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకున్నాయి.