టేకాఫ్ టైమ్‌లో ఆగిన విమానం .. ఇండిగో విమానానికి తప్పిన ముప్పు

Pilot of Mumbai-bound IndiGo flight aborts take-off at last minute, టేకాఫ్ టైమ్‌లో  ఆగిన విమానం .. ఇండిగో విమానానికి తప్పిన ముప్పు

సాంకేతిక లోపం తలెత్తడంతో టేకాఫ్ కావాల్సిన ఇండిగో విమానం ఎయిర్‌బేస్ మీదే నిలిచిపోయింది. మధ్యప్రదేశ్ భూపాల్‌లో రాజ్ భోజ్ ఎయిర్‌పోర్టు నుంచి ముంబై వెళ్లేందుకు రెడీ అవుతున్న ఇండిగోకు చెందిన 6E983 అనే ఫ్లైట్ విమానం స్టార్ట్ అయిన కొద్దిసేపటికే ఆగిపోయింది. అప్పటికే 155 మంది ప్రయాణికుంతా విమానం లోపలికి చేరుకున్నారు. అయితే చివరినిమిషంలో పైలట్ విమానాన్ని నిలిపివేశారు.

గాలిలోకి ఎగరబోతుండగా ఒక్కసారిగ పెద్దశబ్దం చేస్తూ ఆగిపోయింది.దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఫ్లైట్ చక్రాల్లో సాంకేతిక లోపం ఉన్నట్టు గుర్తించిన పైలట్ ..దాన్ని అక్కడే నిలిపివేసి వెంటనే మరమ్మత్తులు చేపట్టారు. అవసరమైన మరమ్మత్తు పనులు చేపట్టినఅనంతరం తిరిగి యధావిధిగా ముంబైకు పయనమైంది. దీంతో ఫైట్‌లో ఉన్న ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *