అత్తారింట కొత్త అల్లుడి సందడి

టాలీవుడ్ హీరో రానా ద‌గ్గుబాటి ఇటీవల లాక్‌డౌన్‌లో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మిహీకా బజాజ్‌తో ఏడడుగులు వేశారు.

  • Ram Naramaneni
  • Publish Date - 11:01 pm, Mon, 26 October 20

టాలీవుడ్ హీరో రానా ద‌గ్గుబాటి ఇటీవల లాక్‌డౌన్‌లో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మిహీకా బజాజ్‌తో కలిసి ఏడడుగులు వేశారు. కాగా రానా ప్రస్తుతం కొత్త‌ల్లుడిగా అంతారింట సందడి చేశారు.  అత్తా మామ‌లు, భార్యతో క‌లిసి దసరా పండుగ రోజున ఎంజాయ్ చేశారు. ప్రత్యేక పూజల అనంతరం అత్త-మామలతో కలిసి రానా, ఆయన సతీమణి మిహీక ఫొటోలు దిగారు.  ఈ ఆనంద‌క‌ర స‌మ‌యాల‌కి సంబంధించిన ఫొటోల‌ని రానా అత్తగారు బంటీ జజాజ్ సోష‌ల్ మీడియా ఇన్ స్టాలో షేర్ చేశారు. ప్రస్తుతం అవి వైరలవుతున్నాయి.

మేలో తాను ప్రేమలో ఉన్నామని,  త‌న ప్రేయ‌సి ఈమే మిహీకా బ‌జాజ్ ఫొటోని రానా షేర్ చేసిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత వీరి వివాహానికి ఇరు కుటుంబాల పెద్ద‌లు అంగీకారం తెల‌ప‌డంతో ఆగ‌స్టు 8న రానా, మిహీకాల వివాహం జ‌రిగింది.

 

Rana Daggubati And Miheeka Bajaj's First Dussehra Celebrations After Wedding

Also Read :

సినిమాను తలదన్నే సీన్.. చిన్నారిని కాపడటానికి నాన్-స్టాప్‌గా 200 కి.మీ…

ఈ మ్యారేజ్ బ్యూరోలో కేవలం రైతులకు మాత్రమే సంబంధాలు చూడబడును