ఏపీలో సెంటు భూమిలో ఇల్లు.. వైరల్ అవుతోన్న ఫొటోలు..

ఏపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. నిజానికి ఈ నెల 8వ తేదీన ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాల్సి ఉండగా.. కోవిడ్ కారణంగా వాయిదా పడింది. దీంతో ఆగష్టు 15వ తేదీన రాష్ట్రంలోని పేదలకు ఇళ్ల పట్టాలు..

ఏపీలో సెంటు భూమిలో ఇల్లు.. వైరల్ అవుతోన్న ఫొటోలు..
Follow us

| Edited By:

Updated on: Jul 16, 2020 | 5:53 PM

ఏపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. నిజానికి ఈ నెల 8వ తేదీన ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాల్సి ఉండగా.. కోవిడ్ కారణంగా వాయిదా పడింది. దీంతో ఆగష్టు 15వ తేదీన రాష్ట్రంలోని పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది ప్రభుత్వం. అయితే పేదలకు ఇచ్చే స్థలంలో ఇంటి నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.

సెంటు స్థలంలో నిర్మించే ఇంటి నమూనాను సిద్ధం చేసిందని పలు వార్తలు వస్తున్నాయి. ఓ చోట సెంటు భూమిలో ఇంటి నిర్మించారు అధికారులు. అందులో హాల్, బెడ్ రూమ్, కిచెన్, బాత్రూమ్‌ అన్నీ కుటుంబానికి సరిపోయేలా డిజైన్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను విడుదల చేశారట. ఆకట్టుకునే విధంగా ఉన్న ఈ నమూనా ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నమూనాలనే ఫైనల్ చేసి.. ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు జగన్ సర్కార్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పటివరకూ ఏపీ ప్రభుత్వం మాత్రం అధికారికంగా ఎలాంటి ఫొటోలు రిలీజ్ చేయలేదు.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 30 లక్షల మంది పేదలకు ఇళ్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. నిజానికి ఈ ఇళ్ల పట్టాలను  ప్రభుత్వం ఏర్పాటై ఏడాదికాకముందే ఇవ్వాలనుకుంది. కానీ అనేక అనివార్య కారణాలతో ఈ పంపిణీ కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది.

Read More:

కరోనాపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. ఈ వైరస్ రాని వ్యక్తి ఉండకపోవచ్చు..

తిరుమలలో అర్చకులకు కరోనా.. టీటీడీ ఛైర్మన్ అత్యవసర భేటీ..