అందాలొలికే బీజేపీ ఎమ్మెల్యే..! ప్లీజ్… డోంట్ కమ్ టు కంక్లూజన్ !

అస్సాం బీజేపీ ఎమ్మెల్యే అంగూర్ లతా డెకా ఫోటో చూసి అంతా బాప్ రే.. అంటున్నారు. కారణం.. ఆమె ఆచ్చు అందాల భరిణలా, సినిమా స్టార్ ని తలపిస్తూ ఉండడమే ! బ్రహ్మాండంగా వైరల్ అవుతున్న ఈ ఫోటో చూసి ఎమ్మెల్యేల్లో ఇంత అందగత్తెలు ఉన్నారా అని అదే పనిగా చూస్తూ పోతే మాత్రం పప్పులో కాలేసినట్టే ! ఇది ఫేక్ అండీ ఫేక్ ! ఇంతకీ ఈమెలా ఉన్నది ఎవరంటే ఫిట్నెస్, యోగా నిపుణురాలు సప్నా వ్యాస్ పటేల్..తన ట్విటర్ లో ఈ మరో బ్యూటీ..అంగూర్ లతా డెకా ఫోటోను పోస్ట్ చేసింది. నిజానికి ఈ ఫోటో డెకాదే నంటూ నెట్ ని షేక్ చేస్తుండడంతో… ‘ కాదండీ బాబూ ! నేనే నా ఫొటోతో బాటు దీన్ని పోస్ట్ చేశా ‘ అంటోందీ అమ్మడు.. పైగా ఈ ‘ ట్రూత్ ‘ ని వాట్సాప్ గ్రూపుల్లో, ఇతర సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నా.. సమాచారానికి ఇంటర్నెట్ బిలీవబుల్ సోర్స్ (నమ్మశక్య మూలం) అవుతుందా, లేదా అన్నది
చూద్దామనే ‘ అంటోంది.

గతంలో జరిగిన అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బటడ్రోబా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా డెకా ఎన్నికయింది. కొన్ని అస్సామీ చిత్రాల్లోనూ నటించింది. ఈమె ఫోటోలను చూసిన మన రామ్ గోపాల్ వర్మ ఊరుకుంటాడా ? ‘ ఇలాంటి లుక్ లు ఉన్నవారు ఎమ్మెల్యే అయితే అచ్ఛే దిన్ ఆయేహై అనుకోవాల్సిందే.. అంగూర్ లతా జీ ! థ్యాంక్యూ మోదీజీ ! ఫస్ట్ టైమ్ పాలిటిక్స్ ని లవ్ చేస్తున్నా ‘ అని ఆమె ఫోటోని పోస్ట్ చేస్తూ తన ట్విట్టర్లో కామెంట్ చేశాడు. ఇక గతంలో రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *