రాజహంసలు గులాబీ రంగులో ఎందుకు ఉంటాయో తెలుసా.. దీని వెనక ఉన్న రహస్యం ఇదే..

సాధారణంగా రాజహంసలు మనకు గులాబీ రంగులో కనిపిస్తుంటాయి. నిజానికి అవి పుట్టినప్పుడు బూడిద రంగులో ఉంటాయి. కానీ పెరిగిన తర్వాత మాత్రం గులాబీ రంగులో కనిపిస్తాయి. ఎందుకో తెలుసా.

|

Updated on: Jan 19, 2022 | 1:12 PM

రాజహంసలు గులాబీ రంగులో మాత్రమే కనిపిస్తాయి. బూడిద రంగు నుంచి గులాబీ రంగులో ఎలా మారతాయి.. ఎందుకు మారతాయో ఎప్పుడైనా ఆలోచించారా ? . వాటి రంగు అనేది డీఎన్ఏ తో ఎలాంటి సంబంధం లేదు.

1 / 5
ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా నివేదిక ప్రకారం.. వాటి శరీర రంగు అలా మారడానికి కారణం అవి తీసుకునే ఆహారం మాత్రమే. అవి ఎక్కువ రోజులు చెరువులలో సరస్సులలో నివసిస్తాయి. సముద్ర జీవుల ఆల్గే, లార్వాలను ఆహారంగా తీసుకుంటాయి. దీంతో అవి రంగు మారతాయి.

2 / 5
నివేదిక ప్రకారం బీటా కెరోటిన్ ఆల్గే, సముద్ర జీవుల లార్వాలో పెద్ద పరిమాణంలో కనుగొన్నారు. అవి ఎరుపు, నారింజ రంగులను కలిగి ఉంటాయి. వీటిని తినడం వలన రంగు స్పష్టంగా కనిపిస్తుంది. శరీరంలోని బీటా కెరోటిన్ పరిమాణాన్ని బట్టి వాటి రంగు గులాబీ లేదా ఎరుపు రంగులో ఉంటుంది.

3 / 5
బీటా కెరోటిన్ ఆల్గే, లార్వా ద్వారా శరీరంలోకి చేరినప్పుడు అది ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైమ్‏ల ద్వారా విచ్చిన్నమవుతుంది. ఫలితంగా పిగ్మెంటెడ్ భాగం శరీరంలోని కొవ్వు భాగానికి చేరుకుంటుంది. ఇక్కడి నుంచి చర్మం, రెక్కలపైకి చేరి ఆ ప్రభావం శరీరంపై కనిపిస్తుంది.

4 / 5
నివేదిక ప్రకారం రాజహంసలు ఎక్కడికి వెళ్లినా.. అక్కడ ఉన్న జీవుల సంఖ్య ఎక్కువ లేదా తక్కువగా ఉంటుంది. అందుకే అన్ని రాజహంసలు ఒకే రంగులో ఉండవు. వివిధ జాతులతో కూడిన రాజహంసల శరీరం రంగు భిన్నంగా ఉంటుంది.

5 / 5
Follow us