- Telugu News Photo Gallery World Cancer Day 2025: Adopt these lifestyle changes to reduce risk of cancer
World Cancer Day 2025: క్యాన్సర్ ముప్పు తప్పించే అలవాట్లు.. వీటిపై తప్పక దృష్టి పెట్టండి
ప్రాణాలను హరించే అత్యంత ప్రమాదకర వ్యాధులలో క్యాన్సర్ ఒకటి. దీని బారీన పడితే కోలుకోవడం అసాధ్యం. అయితే సకాలంలో గుర్తిస్తే చికిత్స ద్వారా నయం చేయడానికి వీలుంటుంది. అందుకే క్యాన్సర్‌పై అవగాహన కల్పించడానికి ప్రతి యేట ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం. క్యాన్సర్ నివారణ, నిర్ధారణ, చికిత్స గురించి అవగాహన పెంచడం లక్ష్యంగా పలు సంస్థలు ఈ రోజున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాయి..
Updated on: Feb 04, 2025 | 5:27 PM

ప్రతి యేట ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీ. క్యాన్సర్ నివారణ, నిర్ధారణ, చికిత్స గురించి అవగాహన పెంచడం లక్ష్యంగా ఈ రోజును క్యాన్సర్ దినోత్సవంగా జరుపుకుంటాం. ఇందుకోసం పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు క్యాన్సర్ నివారణకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తాయి. క్యాన్సర్‌ను నివారించడానికి ఎలాంటి జీవనశైలిని అనుసరించాలో ఇక్కడ తెలుసుకుందాం..

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, క్యాన్సర్ ప్రమాద కారకాలను నివారించడం ద్వారా 30 నుండి 50% క్యాన్సర్లను నివారించవచ్చు. కాబట్టి ఈ రకమైన ప్రమాదాన్ని తగ్గించడంలో ధూమపానం నివారణ కీలకపాత్ర పోషిస్తుంది. క్యాన్సర్‌కు ప్రధాన కారణాలలో పొగాకు వాడకం ఒకటి. ధూమపానం మానేయడం,సెకండ్‌హ్యాండ్ పొగకు గురికాకుండా ఉండటం వల్ల క్యాన్సర్‌ను నివారించవచ్చు.

పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తినడంపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఎర్ర మాంసాలు, చక్కెర పానీయాల వినియోగాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలి. ఈ రకమైన ఆహార అలవాట్లు భవిష్యత్తులో ప్రమాద కారకాలను నియంత్రించడంలో సహాయపడతాయి.

క్యాన్సర్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ముందస్తుగా గుర్తించడం కీలకం. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం వల్ల క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి, అవసరమైన చికిత్స సకాలంలో అందించడానికి వీలుంటుంది.

గర్భాశయ క్యాన్సర్, ఇతర క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించే HPV వ్యాక్సిన్, కాలేయ క్యాన్సర్ నుంచి రక్షించే హెపటైటిస్ బి వ్యాక్సిన్.. పలు రకాల క్యాన్సర్లను నివారించడంలో సహాయపడతాయి. కాబట్టి వైద్యుల సూచన మేరకు ఈ టీకాలు వేయించుకోవడం ముఖ్యం.





























