Parachutes: వేల అడుగుల ఎత్తులో ప్రయాణించినప్పటికీ విమానాల్లో పారాచూట్‌లు ఎందుకు ఉండవు.. అసలు కారణాలు ఇవే..!

Parachutes: విమానం భద్రతకు సంబంధించి ఎయిర్‌లైన్ కంపెనీ ప్రతి విషయంపై శ్రద్ధ చూపుతుంది. అది సాంకేతిక అంశం అయినా లేదా మార్గదర్శకాలను అనుసరించడం అయితే ప్రత్యేక దృష్టి..

|

Updated on: Jun 28, 2022 | 1:48 PM

Parachutes: విమానం భద్రతకు సంబంధించి ఎయిర్‌లైన్ కంపెనీ ప్రతి విషయంపై  శ్రద్ధ చూపుతుంది. అది సాంకేతిక అంశం అయినా లేదా మార్గదర్శకాలను అనుసరించడం అయితే ప్రత్యేక దృష్టి సారిస్తుంటుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే  వాణిజ్య విమానాలలో ప్రతి ప్రయాణికుడికి పారాచూట్ లేకపోవడం. అన్ని వాణిజ్య విమానాలకు పారాచూట్‌లు ఉండవు. మరి ఇలా ఎందుకు ఉండవనే దానిపై మీరెప్పుడైన ఆలోచించారా..? ఇందుకు కారణాలు తెలుసుకోండి.

1 / 5
వాణిజ్య విమానాల్లో పారాచూట్‌లు ఉండకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. దీనికి అతిపెద్ద కారణం ఏమిటంటే, పారాచూట్ చాలా ఖరీదైనది. అలాగే చాలా బరువుగా ఉంటుంది. ప్రయాణికులతో నిండిన వాణిజ్య విమానంలో దీన్ని ఉంచడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పారాచూట్‌ ఉండటం వల్ల విమానం బరువు మరింతగా పెరుగుతుంది.

2 / 5
విమానం బరువు పెరగడం వల్ల అది ఎగరడానికి మరింత ఇంధనం కావాలి. ఈ విధంగా విమానం ఎగరడానికి మొత్తం ఖర్చు గణనీయంగా పెరుగుతుంది.

3 / 5
పారాచూట్ లేకపోవడానికి రెండవ అతిపెద్ద కారణం ఏంటంటే అది వాణిజ్య విమానాలకు సరిపడకపోవడమే. ప్రయాణికులు పారాచూట్‌తో దాని నుండి దూకగలిగే విధంగా వాణిజ్య విమానాలు రూపొందించబడలేదు. అందువల్ల పారాచూట్లను విమానంలో ఉంచరు.

4 / 5
విమానంలో ప్రయాణించే ప్రయాణికులు పారాచూట్ ద్వారా కిందకు దిగేందుకు శిక్షణ పొందకపోవడం దీనికి మరో ముఖ్యమైన కారణం. పారాచూట్‌ను సరిగ్గా ఉపయోగించడంలో శిక్షణ తీసుకోవడం కూడా ఎంతో అవసరం. వేగంగా ఎగురుతున్న విమానం నుంచి పారాచూట్‌తో ల్యాండ్ చేయడం అంత సులభం కాదు. అందుకే విమానంలో పారాచూట్ల సౌకర్యం ఏర్పాటు చేయలేదు.

5 / 5
Follow us