Python Hatchlings: నిర్మాణ పనుల్లో దొరికిన కొండచిలువ గుడ్లు.. కృతిమంగా పొదిగించిన అనంతరం పిల్లల్ని..

Python Hatchlings: ఇప్పటి వరకూ కృత్రిమంగా కోడి గుడ్లను, బాతు గుడ్లను పొదిగించి.. పిల్లలను పుట్టించడం చూశాం.. అయితే అసలు ఎప్పుడైనా పాము గుడ్లను కృత్రిమంగా పొడిగించి పిల్లలు పుట్టేలా చేస్తారని విన్నారా.. కనీసం ఇలాంటి సంఘటన ఒకటి జరుగుతుందని ఊహించారా.. కానీ ఇప్పుడు రియల్ గా కర్ణాటకలో చోటు చేసుకుంది ఈ విచిత్ర సంఘటన.

|

Updated on: Jun 24, 2022 | 7:49 PM

కర్ణాటకకు చెందిన  పాముల సంరక్షులు కిరణ్, అజయ్​ లు ఏకంగా కొండ చిలువ గుడ్లనే పొదిగించారు. కృత్రిమ పొదిగే పద్ధతిలో పుట్టిన ఎనిమిది కొండచిలువలను ఈ జిల్లాలోని మంగళూరులో అటవీ అధికారుల ఆధ్వర్యంలో జంతు ప్రేమికులు గురువారం అడవిలో వదిలారు.

1 / 5

కిరణ్‌, అజయ్‌, అటవీశాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు, వన్యప్రాణుల కార్యకర్తలు మెచ్చుకుంటున్నారు. కిరణ్​, అజయ్​ లపై అటవీ సిబ్బందితో సహా, స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

2 / 5
వెంకటరమణ ఆలయానికి ఎదురుగా ఉన్న దొంగకేరి సమీపంలో ఓ భవనం నిర్మిస్తున్న సమయంలో గుడ్లు బయటపడ్డాయి. ఇంటి యజమాని షమిత్ సువర్ణ గుడ్ల గురించి పాము కార్యకర్త అజయ్‌కి తెలియజేసాడు. ఈ విషయాన్ని అజయ్.. కిరణ్‌కి చెప్పాడు. దీంతో పాములు కృత్రిమ పొదిగే ఏర్పాటు చేశారు

3 / 5
గుడ్లు కృత్రిమ పద్దతిలో  కొండచిలువలు పిల్లలుగా ఏర్పడిన తర్వాత బంట్వాళ మండల అటవీ అధికారి రాజేష్ బలిగార్‌కు సమాచారం అందించారు.

4 / 5
పాము సంరక్షకులు కొండచిలువలను సురక్షితంగా అటవీ ప్రాంతానికి తరలించి విడిచిపెట్టారు. కార్యక్రమంలో సబ్ జోనల్ ఫారెస్ట్ ఆఫీసర్ ప్రీతం పూజారి, ఫారెస్ట్ గార్డులు పాల్గొన్నారు.

5 / 5
Follow us