Yellow Crazy Ants: ఏడు గ్రామాల్లో చీమల బీభత్సం.. కనపడిన జంతువునల్లా తినేస్తున్న చీమలు.. వలస వెళ్తున్న ప్రజలు

చీమే కదా నలిపేస్తే చచ్చిపోతుంది అనుకుంటే పొరపాటు.. అవి గుంపుగా దండెత్తివస్తే.. ఎంతటి బలమైన శక్తికలవో ఎప్పుడో మన సుమతి శతకంలో చెప్పారు. అవి లక్షలు కలిసి వస్తే.. మనుషులేనా పారిపోవాల్సిందే .. తాజాగా తమిళనాడు రాష్ట్రంలో అనేక గ్రామాల్లో చీమలను చూసి మనుషులు పారిపోతున్నారు. చీమలు సృష్టిస్తోన్న బీభత్సంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

|

Updated on: Aug 30, 2022 | 11:24 AM

చీమల బెడదతో తమిళనాడు గ్రామస్తులు ప్రశాంతంగా జీవించలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కరంతమలై రిజర్వ్‌ ఫారెస్టు చుట్టుపక్కల ప్రాంతాల్లో 'ఎల్లో క్రేజీ యాంట్స్‌' అనే చీమలు విజృంభిస్తున్నాయి. చీమలు దండులా వచ్చి.. ఏది కనిపిస్తే అది తినేస్తున్నాయి. దీంతో ప్రజలు తమ సొంత గ్రామాలను వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నారు.

1 / 8
 చూడడానికి సన్నగా చిన్నగా ఉండే ఈ చీమలు చాలా స్పీడ్ గా కదులుతాయి. ఇవి ఏది దొరికినా స్వాహా చేస్తుంటాయి. స్థానిక జాతుల కీటకాలు, చీమల పుట్టల్ని ఆక్రమించి వాటిని నాశనం చేసి ఆక్రమించుకుంటాయి. చిన్నచిన్న కీటకాలను, పురుగులను తినేస్తుంటాయి. దీంతో ఇళ్లల్లోని పశువులు, మొక్కలు ఏవీ సురక్షితంగా లేవంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

2 / 8
 ఈ ఎల్లో క్రేజీ యాంట్స్‌ ఆకలికి అంతం లేదని..  ఏది కనిపించినా తినేస్తున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు. పంటపొలాల్ని నాశనం చేస్తున్నాయి. మేకలు, పశువుల, ఎద్దుల పుండ్లమీద దాడి చేసి.. మాంసాన్ని తినేస్తున్నాయి. దీంతో ఇప్పటికే అనేక పశువులు మృతి చెందాయని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేకలు, ఆవులు వంటి అనేక పశువులు చూపుని కోల్పోయాయని చెబుతున్నారు. ఎలుకలు, పిల్లులు, కుందేళ్లను,  పాములు, బల్లులను ఇలా ఏది కనిపించినా గుటకాయస్వాహా అంటూ మింగేస్తున్నాయి.

3 / 8
  ఈ  చీమలు ఇంతకుముందు ఇక్కడకు వచ్చాయి. కానీ ఇంత భారీ సంఖ్యలో కనిపించడం ఇదే మొదటిసారని .. గతంలో ఎప్పుడూ లేనంత భీభత్సం సృష్టిస్తున్నాయని వేలాయుధంపట్టి వాసులు చెబుతున్నారు. అడవుల నుంచి లక్షల సంఖ్యలో గ్రామాల బాట పట్టాయి. ముఖ్యంగా చల్లటి వాతావరణం కనుక వీటి దాడి అధికంగా ఉంది. ఏడు గ్రామాల ప్రజల జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇంటినుంచి బయటికి రావడానికే భయపడుతున్నారు. ప్రస్తుతం చీమల బెడదతో పశువులను మేతకు తీసుకెళ్లడం లేదని రైతులు తెలిపారు. అలాగే అడవికి సమీపంలోని ఇళ్లను కూడా వదిలి పారిపోయారని చెప్పారు.

4 / 8
 ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రకారం..  పసుపు చీమలు ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకర జాతులు.  ఇవి కుట్టవు.. కరవవు.. కానీ ఫార్మిక్ ఆమ్లాన్ని విడుదల చేస్తాయి. ఈ ఫార్మిక్ యాసిడ్ స్రావాల వల్ల చర్మంపై దురద, పొట్టురాలడం వంటి అసౌకర్యం కలుగుతుంది.  పశుపక్ష్యాదుల కంట్లో పడితే చూపు పోతుంది. మనిషి శరీరంపైకి క్షణంలో ఎక్కేస్తుంది. గ్రామంలో నీటి కుంటల వద్దకు వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితులు నెలకొన్నాయి.  తమ రోజువారీ జీవనం దుర్భరంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

5 / 8
 చీమల బెడద పెరగడానికి వాతావరణంలో ఉష్ణోగ్రతలే కారణమని కీటక శాస్త్రవేత్త డాక్టర్ ప్రియదర్శన్ ధర్మరాజన్ చెబుతున్నారు. అధిక వేడి వల్ల చీమల జీవక్రియ రేటు పెరిగిందని.. దీంతో ఎక్కువ ఆహారం తినే పరిస్థితి ఏర్పడి.. అడవుల నుంచి గ్రామాల మీదకు వస్తున్నాయని చెప్పారు. అయితే ఇది ధృవీకరించాల్సి ఉందని.. ఈ కోణంలో పరిశోధనలు చేస్తున్నట్లు చెప్పారు.

6 / 8
 'ఎల్లో క్రేజీ యాంట్స్‌' దాడులు గతంలో కేరళ అడవుల్లోని పలు గ్రామాల్లో కనిపించాయి. వాటిపై 'సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ కేరళ' ప్రతినిధులు పరిశోధనలు చేశారు. గతంతో పోల్చితే ఇప్పుడు ఈ చీమల జాతుల విస్తరణ బాగా పెరుగుతోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

7 / 8
 ఆసియా, ఆస్ట్రేలియా, పశ్చిమ ఆఫ్రికాలో ఈ చీమలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. 5 మి.మీ. వరకు పొడవు ఉంటాయి. పొడవైన కాళ్లు, తల మీద పొడవైన యాంటెన్నా లాంటివి ఉంటాయి. ముదురు గోధుమ వర్ణంతో ఉంటాయి. 80 రోజుల వరకు ఈ చీమలు జీవిస్తాయి. వీటి జనాభాను తగ్గించే విధంగా పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రజ్ఞులు

8 / 8
Follow us
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..

ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..

చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.

సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?

కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!

పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎

భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన

24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..

ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే

కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి