Bullet Baba temple: అక్కడ బుల్లెట్‌కు పూజలు, గుడి కూడా కట్టేశారు.. చాలా పెద్ద రీజనే ఉందండోయ్…

భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, విభిన్న సంస్కృతులు…వేల సాంప్రదాయాలు. అలాగే మన దేశంలో పూజించే దేవతలు, బాబాల సంఖ్య కూడా ఎక్కువే. అయితే ఇప్పుడు మేము ఓ విలక్షణ టెంపుల్..అందులో పూజలందుకుంటున్న బాబా గురించి చెప్పబోతున్నాం.

  • Ram Naramaneni
  • Publish Date - 9:49 pm, Thu, 8 April 21
1/5
Temple For Bullet 5
రాజస్థాన్‌లోని పాలీ దగ్గర 350 సీసీ రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ని అక్కడి ప్రజలు దైవంగా భావిస్తారు. వినడానికి కాస్త ఆశ్చర్యం కలిగించినా..ఇది పూర్తి వాస్తవం. కొన్నేళ్ల కిందట ఓమ్ బన్నా అనే వ్యక్తి నేషనల్ హైవే బుల్లెట్ బైక్‌పై ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తూ మృతిచెందాడు.
2/5
Bullet Temple 1
దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆ బుల్లెట్ బైక్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే తెల్లారేసరికి ఆ బైక్ పోలీసులకు కనిపించలేదు. దానికోసం వెతుకులాట ప్రారంభించగా..సరిగ్గా యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలోనే కనిపించింది.
3/5
Bullet Temple 3
పోలీసులు ఆ బైక్‌ను మళ్లీ తీసుకొచ్చి ఎన్ని జాగ్రత్తలు చేసినా..తెల్లారేసరికి ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే ఉండేది. ఇలా పోలీసులు ఆ బైక్‌ను స్టేషన్‌లో ఉంచడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
4/5
Bullet Temple 4
ఈ విషయం స్థానికంగా ప్రచారంలోకి రావడంతో తమకు ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రజలు ఆ బైక్‌ని పూజించడం మొదలు పెట్టారు. ఓ చిన్న స్టేజ్‌ను ఏర్పాటు చేసి దానిపై బైక్ ని ఉంచి నిత్య పూజలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రాంతం ఒక దైవ ప్రదేశంలా మారింది.
5/5
Bullet Temple 2
ఎండా, వానల నుంచి రక్షణకు ఆ బైక్ చుట్టూ అద్దాలు ఏర్పాటు చేశారు. ఓమ్ బన్నా పేరు మీదగా ఆ ప్రదేశానికి ఓ బన్నా టెంపుల్ అని పేరొచ్చింది. ప్రమాదాల బారిన పడకుండా చూడాలంటూ ఆ బండి పక్కనే ఉన్న ఓ చెట్టుకి వాహనదారులు దారాలు కడుతుంటారు. ఓమ్ బన్నా విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు.