ఒంటరితనంతో బాధపడుతున్నారా..? ఈ చిట్కాలు ట్రై చేసి దాని నుండి బయటపడండి
ఒంటరితనం అనేది ఒక వ్యక్తి అణగారిన మానసిక స్థితి. ఈ పరిస్థితి చాలా కాలం పాటు కొనసాగితే, ఆ వ్యక్తి డిప్రెషన్‌కు గురవుతాడు. కొంత మంది తమతో ఇతర వ్యక్తులు ఉన్నప్పటికీ ఒంటరితనం అనుభవిస్తారు. వారి మానసిక పరిస్థితులు, వేరే వ్యక్తులతో కలవలేకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ రోజు మనం కొన్ని ప్రభావవంతమైన చిట్కాల గురించి తెలుసుకుందాం.. వీటిని అనుసరించి ఒంటరితనం నుండి బయటపడవచ్చు. ఈ చిట్కాల గురించి వివరంగా తెలుసుకుందాం.
Updated on: Feb 03, 2025 | 9:10 AM

ఒంటరితాన్ని ఎదుర్కోవడానికి అనేక మార్గాలు ఉన్నాయని మానసిక ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వ్యక్తులను బట్టి వారి మనస్తత్వాలు, అభిప్రాయాలు, ఆలోచనలు వేర్వేరుగా ఉన్నట్లే ఒంటరితనం నుండి బయటపడేలా చేసే చిట్కాలు వ్యక్తులను బట్టి పని చేస్తుంటాయని అంటున్నారు.

మీకు సంతోషాన్ని కలిగించే పనులపై దృష్టి పెట్టండి. ఇందులో డ్యాన్స్, వంట, ప్రయాణం లేదా వ్యాయామం వంటి అంశాలు ఉండవచ్చు. దీని కోసం మీరు ఇతరులతో కలిసే అవకాశం దొరుకుతుంది. ఇక్కడ మీరు నలుగురితో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇది మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. మీరు ఒంటరిగా ఉండరు.

ఒంటరితనాన్ని తొలగించడంలో స్వీయ సంరక్షణ చాలా సహాయకారిగా ఉంటుంది. దీని కోసం, మిమ్మల్ని మీరు విలాసపరుచుకోండి, డైట్‌పై దృష్టి పెట్టండి. ప్రతిరోజూ వ్యాయామం చేయండి. వర్కవుట్ చేయడమే కాకుండా రాత్రిపూట బాగా నిద్రపోవడానికి ప్రయత్నించండి. అందం, జుట్టు సంరక్షణ వంటి అన్ని విషయాలలో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి. ఇది మిమ్మల్ని మానసికంగా సంతోషంగా ఉంచుతుంది.

ఒంటరితనాన్ని అధిగమించడానికి, మీరు సినిమా లేదా వెబ్ సిరీస్ చూడవచ్చు. లేదంటే, గార్డెనింగ్, మొక్కల్ని పెంచటం అలవాటు చేసుకోండి.

అందమైన పూల మొక్కలు, పండ్లు, కూరగాయలు మీ గార్డెన్‌లోనే చూస్తుంటే ఆ ఆనందం మిమ్మల్నీ మరింత సంతోషంగా, ఉత్సహంగా ఉండేలా చేస్తుంది. ఇది ఒంటరిగా అనిపించే బదులు ఆనందించడంపై మీ దృష్టిని ఉంచుతుంది.





























