Best Folding Phones: ఈ ఫోన్లను మడతపెట్టేయొచ్చు.. మార్కెట్లో ఉన్న కొన్ని ఫోల్డబుల్ ఫోన్లపై ఓ లుక్కేయండి..

Best Folding Phones: స్మార్ట్ ఫోన్‌లు ప్రస్తుతం తమ రూపాన్ని మార్చుకుంటున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఫోల్డుబుల్ ఫోన్‌ల హవా నడుస్తోంది. ప్రముఖ కంపెనీలన్నీ ఫోల్డబుల్ ఫోన్‌ల తయారీలో భాగస్వాములవుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో సందడి చేస్తోన్న కొన్ని...

  • Narender Vaitla
  • Publish Date - 3:39 pm, Mon, 12 April 21
1/7
మొబైల్ రంగంలోకి స్మార్ట్ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
2/7
ఒకప్పుడు ఫోన్ కంటే కేవలం సమాచారాన్ని మార్చు కోవడానికి మాత్రమే ఉపయోగపడేది.. కానీ నేడు స్మార్ట్ ఫోన్‌తో చేయలేనిది అంటూ ఏదీ లేదు.
3/7
ఈ క్రమంలోనే స్మార్ట్ ఫోన్‌కు కొనసాగింపుగా మడతపెట్టే ఫోన్లు వచ్చేశాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌లపై ఓ లుక్కేయండి..
4/7
Samsung Galaxy Z Fold 2: 6 కెమెరాలతో ఉండే ఈ ఫోల్డబుల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ యూజర్లను ఆకట్టుకుంటోంది. 7.6 ఇంచుల డిస్‌ప్లే, 120 హెర్డ్జ్ రిఫ్రేష్ రేట్‌తో ప్లే అయ్యే వీడియోలు అద్భుతంగా ఉంటాయి. ఆండ్రాయిడ్ 2.5తో నడిచే ఈ స్మార్ట్ ఫోన్‌లో 12జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
5/7
Samsung Galaxy Z Flip 5G: 5జీ సపోర్ట్‌తో పనిచేసే ఈ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచుల అమోఎల్ఈడీ స్క్రీన్‌తో అందుబాటులో ఉంది. స్నాప్‌డ్రాగన్ 856+ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ మెమొరీ ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌కు ఫింగర్ ప్రింట్‌ స్కానర్ పక్కన ఉండడం విశేషం.
6/7
Moto Razr 5G (2020): ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌లలో మోటో కంపెనీకి చెందిన రేజర్ 5జీ కూడా దూసుకెళుతోంది. తెరిచినప్పుడు ఈ ఫోన్ స్క్రీన్ 6.2 ఇంచులు ఉంటుంది. ఇందులో ప్రైమరీ కెమెరాకు 48 మెగా పిక్సెల్, 20 మెగా పిక్సెల్‌తో సెల్ఫీ కెమెరా అందించారు. నైట్ మోడ్, ఏ‌ఐ‌ టెక్నాలజీతో తీసుకొచ్చారు.
7/7
Xiaomi Mi MIX Fold: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఎమ్ఐ కూడా ఫోల్డబుల్ ఫోన్‌ను రూపొందించింది. అమోఎల్ఈడీ స్క్రీన్‌తో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో 60 హెర్డ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందించారు. డాబ్లీ విజన్, 6.5 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఈ ఫోన్ ప్రత్యేకత.