Junio App: చిన్నారుల కోసం ప్రత్యేకంగా డిజిటల్‌ పేమెంట్‌ యాప్‌.. పేటీఎం మాజీ ఉద్యోగుల వినూత్న ఆలోచన..

Junio App: ప్రస్తుతం అన్ని లావాదేవీలు డిజిటలైజేషన్‌ అవుతున్నాయి. మరి చిన్నారులకు ఇచ్చే పాకెట్ మనీకూడా డిజిటలైజేషన్‌గా మారితే ఎలా ఉంటుంది.? ఇలాంటి ఆలోచన నుంచే జూనియో యాప్‌ పుట్టుకొచ్చింది. ఈ యాప్‌ ద్వారా చిన్నారులు..

|

Updated on: Feb 19, 2022 | 6:32 PM

ప్రస్తుతం డిజిటల్‌ లావాదేవీలు భారీగా పెరిగాయి. అయితే ఇది కేవలం పెద్దలకు మాత్రమే పరిమితం. మరి చిన్నపిల్లలకు డిజిటల్‌ యాప్స్‌ అందుబాటులో ఉంటే ఎలా ఉంటుంది. ఇలాంటి ఆలోచనతోనే పేటీఎం కంపెనీ మాజీ ఉద్యోగులుసరికొత్త యాప్‌ను తీసుకొచ్చారు.

1 / 5
'జూనియో' పేరుతో రూపొందించిన ఈ యాప్‌ సహాయంతో పిల్లలు రోబోలాక్స్‌, అమేజాన్‌ నుంచి వారికి నచ్చిన వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ యాప్‌ ఐఓస్‌, ఆండ్రాయిడ్‌లో అందుబాటులో ఉంది.

2 / 5
చిన్నారులు ఆన్‌లైన్‌ లావాదేవీలు చేసిన వెంటనే పేరెంట్స్‌కు మెసేజ్‌ వచ్చే వెసులుబాటును కల్పించారు. దీంతో పాటు ఒక వర్చువల్ కార్డును కూడా అందిస్తారు. అయితే దీనిని బ్యాంక్‌ అకౌంట్‌కు లింక్‌ చేయాల్సిన అవసరం ఉండదు.

3 / 5
చిన్నారులు కేవలం రూ. 10 వేల మాత్రమే ఉపయోగించుకునే వీలు ఉంటుంది. ఈ యాప్‌ రూపే అనుబంధంగా పని చేస్తుంది. తల్లిదండ్రులు తమ చిన్నారుల ఖాతాలో డబ్బులు జమ చేయొచ్చు.

4 / 5
ఇక ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఈ యాప్‌ను ఇప్పటికే 10 లక్షలు మంది చిన్నారులు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ప్రతిరోజూ నిత్యం 10 వేల ట్రాన్సాక్షన్స్‌ జరుగుతున్నాయి. దీనిబట్టి చూస్తుంటే ఇక భవిష్యత్తులో చిన్నారుల పాకెట్‌ మనీ కూడా డిజిటలైజేషన్‌ అవుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు కదూ!

5 / 5
Follow us