Oppo Reno 6: ఒప్పో నుంచి రెండు కొత్త స్మార్ట్‌ ఫోన్‌లు.. అదిరిపోయే ఫీచర్లతో ఆకట్టుకుంటోన్న ‘రెనో’ సిరీస్‌..

Oppo Reno 6: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ ఒప్పో భారత మార్కెట్లోకి రెండు కొత్త ఫోన్‌లను లాంచ్‌ చేస్తోంది. ఇప్పటికే చైనాలో విడుదల చేసిన ఈ ఫోన్‌లను జులై 14న భారత్‌లో విడుదల చేయనున్నారు. మరి ఈ ఫోన్‌లకు సంబంధించిన ఫీచర్లు, ధరలు ఎలా ఉన్నాయంటే..

|

Updated on: Jul 02, 2021 | 11:18 AM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ కంపెనీ ఒప్పో భారత్‌లో మంచి బ్రాండ్‌ను క్రియేట్ చేసుకుంది. ఎప్పటికప్పుడు ఆకట్టుకునే ఫీచర్లతో కొత్త ఫోన్‌లను లాంచ్‌ చేస్తోన్న ఒప్పో తాజాగా మరో రెండు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది.

1 / 6
రెనో సిరీస్‌లో భాగంగా ఒప్పో రెనో 6, ఒప్పో రెనో 6 ప్రో ఫోన్‌లను మే 27న చైనాలో లాంచ్‌ చేసింది. ఇక ఈ ఫోన్‌లను భారత మార్కెట్లో జులై 14న విడుదలచేయనున్నారు.

2 / 6
5జీ మోడల్స్‌లో వచ్చిన ఒప్పో రెనో 6, రెనో 6 ప్రో ఫోన్‌లు స్నాప్‌డ్రాగన్‌ 870 ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. ఇక రెనో 6లో 6.43 ఇంచెస్‌ ఫుల్‌హెచ్‌డీ+అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. రెనో 6 ప్రోలో 6.55 ఇంచెస్‌ స్క్రీన్‌ను పొందుపరిచారు.

3 / 6
ఇక కెమెరా విషయానికొస్తే ఒప్పో ఈ రెండు మోడల్స్‌లో 64 మెగాపిక్సెల్‌ (రెయిర్‌ కెమెరా), 32 మెగాపిక్సెల్ (సెల్ఫీ) కెమెరా అందిస్తున్నారు.

4 / 6
స్టోరేజ్‌ విషయానికొస్తే.. 12 జీబీ ర్యామ్‌+256 జీబీ ఇంటర్ననల్‌ స్టోరేజీని అందించారు. ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్‌ 11.3పై పనిచేస్తాయి.

5 / 6
ఒప్పో రెనో 6 ధర రూ. 31,800, ఒప్పో రెనో 6 ప్రో ధర రూ. 39,800గా ఉండనున్నట్లు తెలుస్తోంది.

6 / 6
Follow us