Cook Vacancy: మీరు టేస్టీగా వంట చేస్తారా.. అయితే స్టార్ క్రీడాకారుడికి చెఫ్ కావాలంట.. నెలకు రూ. 4.5 లక్షల జీతం..

ప్రపంచంలో ఏ వృత్తికైనా ఎక్స్పెరీ డేట్ ఉంటుందేమో కానీ.. వండేవారికి ఉండదు అని అంటారు. ఎందుకంటే తినేవారు ఎప్పుడు ఉంటారు కనుక. అందుకనే టేస్టీ టేస్టీగా వంట చేసే చెఫ్ లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. తాజాగా సూపర్ స్టార్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో ​​రొనాల్డోకు వ్యక్తిగత చెఫ్ అవసరం ఏర్పడింది. దీని కోసం భారీ జీతం కూడా చెల్లించబోతున్నాడు. అయినప్పటికీ ఇప్పటివరకు అతను వ్యక్తిగత చెఫ్‌ను రిక్యుట్ చేసుకోలేక పోయాడు. 

|

Updated on: Jan 20, 2023 | 7:06 PM

పోర్చుగల్‌కు చెందిన సూపర్‌స్టార్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో ​​రొనాల్డో గురించి తెలియని వారు ప్రపంచంలోనే ఉండరు. మాంచెస్టర్ యునైటెడ్‌తో ఒప్పందాన్ని ముగించుకున్న తర్వాత సౌదీ అరేబియా ఫుట్‌బాల్ జట్టు అల్ నాస్ర్‌తో ఆడేందుకు రొనాల్డో రియాద్‌కు చేరుకున్నప్పటి నుండి.. నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. రోజు రోజుకీ అతని క్రేజ్ మరింత పెరుగుతోంది.

1 / 6
అదే సమయంలో, క్రిస్టియానో ​​రొనాల్డో ప్రస్తుతం ఒక విచిత్రమైన సమస్యలో చిక్కుకున్నాడు. అయితే ఈ సమస్య ఫుట్‌బాల్ పిచ్‌కు సంబంధించినది కాదు.. ఇది పిచ్ వెలుపల విషయం. రొనాల్డో తన కుటుంబం కోసం ఒక వ్యక్తిగత చెఫ్‌ని నియమించుకోవాలనుకుంటున్నాడు. పోర్చుగల్‌లోని అల్ నాస్ర్ ఫార్వర్డ్ లో ఉన్న తన ఇంట్లో వంట చేయడానికి ఓ చెఫ్‌ కావాలని తెలిపాడు. 

2 / 6
అయితే..  రొనాల్డో ఎంత కస్టపడి వెదుకుతున్నా.. ఇప్పటి వరకూ వ్యక్తిగత చెఫ్‌ను నియమించుకోవడంలో విజయం సాధించలేకపోయాడు. పోర్చుగల్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ రొనాల్డో .. తన భార్య జార్జినా రోడ్రిగ్జ్ లు వ్యక్తిగత వంటకు సంబంధించి కొన్ని షరతులు పెట్టారు. అదే సమయంలో, ఉద్యోగం పొందే చెఫ్ పోర్చుగల్‌లోని రొనాల్డో ఇంట్లో వంటమనిషిగా పని చేయాల్సి ఉంటుంది.

3 / 6
బ్రిటిష్ వార్తాపత్రిక ది మెయిల్ ప్రకారం..  ఈ జంట తమ వ్యక్తిగత చెఫ్ పోర్చుగీస్ ఆహారాన్ని తయారు చేయడమే కాకుండా రుచికరమైన అంతర్జాతీయ వంటకాలను తయారు చేయడంలో నైపుణ్యం కలిగి ఉండాలని కోరుకుంటున్నారు. ఉదాహరణకు, జపనీస్ ఫుడ్ సుషీని ఎలా తయారు చేయాలో అతనికి తెలిసుండాలి. రోనాల్డో పోర్చుగల్‌లో 17 మిలియన్ పౌండ్ల (సుమారు రూ. 170 కోట్లు) విలువైన ఆస్తిని కొనుగోలు చేశాడు

4 / 6
ఇప్పుడు రొనాల్డో తన వ్యక్తిగత చెఫ్‌కి ఎంత జీతం ఇస్తాడనే ప్రశ్న తలెత్తుతుంది. నివేదిక ప్రకారం, ఎవరైనా చెఫ్‌గా నియమితులైతే, అతనికి నెలకు 4500 పౌండ్ల (దాదాపు రూ. 4.5 లక్షలు) జీతం లభిస్తుంది. రోనాల్డో తన కెరీర్‌లో చివరి దశను ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నాడు. 

5 / 6
ప్రస్తుతం, రొనాల్డో తన కుటుంబం కోసం పోర్చుగల్‌లోని క్వింటా డా మారిన్హాలో విలాసవంతమైన ఇంటిని నిర్మిస్తున్నాడు. 37 ఏళ్ల ఫుట్‌బాల్ క్రీడాకారుడు సెప్టెంబర్ 2021లో తన ఇంటి కోసం భూమిని కొనుగోలు చేశాడు. జూన్ 2023 నాటికి అతని ఇల్లు పూర్తవుతుందని తెలుస్తోంది.  అల్ నాస్ర్ తరఫున ఆడేందుకు రొనాల్డో గత నెలలో సౌదీ అరేబియా చేరుకున్నాడు

6 / 6
Follow us