Airavatesvara Temple : సైన్స్ కు అందని అద్భుతం ఈ ఆలయం.. మెట్లను తాకితే చాలు సప్తస్వరాలే పలుకుతాయి

తమిళనాడులోని కుంభకోణంలో ఉన్న ప్రసిద్ధ శైవ క్షేత్రం ఐరావతేశ్వర దేవాలయం. ఈ దేవాలయాన్ని 12 వ శతాబ్దంలో రాజరాజ చోళుడు II నిర్మించాడు. ఇది యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. ఈ ఆలయ మెట్లు సంగీతాన్ని వినిపిస్తాయి. ఈ దేవాలయం కూడా చోళుళ నిర్మాణ శైలికి తార్కాణంగా నిలుస్తుంది.

|

Updated on: Mar 09, 2021 | 5:33 PM

 చోళరాజుల ప్రసిద్ధ నిర్మాణాల్లో ఒకటి శ్రీ ఐరావతేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం దారాసురంలో ఉంది. ఇక్కడి శివుని పేరు'' ఐరావతేశ్వరుడు. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో చోళులు నిర్మించారు. ఇప్పటికీ నిత్యం దూప, ధీప నైవేద్యాలు జరుగుతున్న దేవాలయాల్లో ఒకటి.

1 / 6
ఇంద్రుని వాహనమైన ఐరావతం (తెల్ల ఏనుగు), యముడు ఇక్కడ ఉన్న స్వామిని  ఆరాధించినట్లు పురాణేతిహాల కథనం. శివుడిని ఏడు తొండాలు, నాలుగు దంతాలు కలిగిన ఇంద్రుడి వాహనమైన ఐరావతం భక్తి శ్రద్దలతో పూజించినట్లు పురాణాల కథనం

2 / 6
యమ ధర్మ రాజుకి ఓ యోగి ఇచ్చిన శాపంతో శరీరం అంతా మంటపుడుతున్నట్లు ఇబ్బంది పడుతుంటే.. అప్పుడు ఈ ఆలయంలో ఉన్న పవిత్ర కోనేరులో మునిగి శాపం విమోచనం పొందినట్లు భక్తుల నమ్మకం. అందుకనే ఇక్కడ ఉన్న పుష్కరిణికి యమతీర్ధం అనే పేరు వచ్చింది.  .

3 / 6
ఐరావతం దుర్వాస మహాముని కోపానికి గురై శాపం తో తెలుపు రంగుని కోల్పోయింది. అప్పుడు ఈ ఆలయంలోని శివుడిని ఆరాధించి అక్కడ ఉన్న కోనేరులో స్నానమాచరించగా పూర్వపు రంగైన తెలుపు రంగుని పొందినట్లు పురాణాల్లో ఉంది. అందుకనే అప్పటి నుంచి ఈ ఆలయంలో ఉన్న శివుడిని ఐరావతేశ్వరాలయం అని పిలుస్తారని పెద్ద లింగ రూపంలో ఉన్న శివయ్య ఐరావతేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నారని స్థలం పురాణం

4 / 6
చాళుక్యులు శిల్పకళలను ప్రోత్సహించారు. ఈ ఆలయం లో కూడా ప్రతిభావంతులైన శిల్పులు చెక్కిన శిల్పాలు చూడచక్కగా ఉంటాయి. రథం ఆకారంలో ఉన్న ఈ ఆలయానికి రాతి చక్రాలను చెక్కారు. రధం ఆకారంలో ఉండే ఆలయానికి రాతి చక్రాలు, వాటిని లాగుతున్నట్లుగా ఏనుగులను, అశ్వాలను మలచారు. ఇక ఆలయ గోపురం ఎనభై అడుగుల ఎత్తుతో ఎంతో ఠీవి గా కనిపిస్తూ.. పర్యాటకులను భక్తులను ఆకర్షిస్తుంది.

5 / 6
ఈ ఐరావతేశ్వర ఆలయంలో సైన్ కు అందని అద్భుతాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న వివిధ స్వరాలను పలికే శిల్పాలు దర్శించుకోవచ్చు. అంతేకాదు.. సంగీతాన్ని ప్రతిధ్వనించే రాతి మెట్లు కూడా ఉన్నాయి. ఇవి స్వరాలను ఎలా పలుకుతున్నాయనేది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే..

6 / 6
Follow us