Kapaleshwar Mandir: శివుడు బ్రహ్మహత్యా దోషాన్ని స్నానమాచరించి పోగొట్టుకున్న పవిత్ర క్షేత్రం ఎక్కడో తెలుసా

Kapaleshwar Mandir: స్మశాన వాసి భోళాశంకరుడి దేశ వ్యాప్తంగా అనేక ఆలయాలున్నాయి. కొన్ని స్వయంభువుగా వెలసిన ఆలయాలు అయితే మరికొన్ని నిర్మితాలు. భక్తులు కోరిన కోరికలు తీర్చే శంకరుడు నివసించిన ప్రాంతం మహారాష్ట్రలోని పంచవటి.

|

Updated on: Jun 10, 2021 | 5:45 PM

మహారాష్ట్రలోని నాశిక్ పట్టణంలోని పంచవటి అనే ప్రాంతంలో కొలువైన ఆలయం కపలేశ్వర్మహదేవ్ ఆలయం. ఇక్కడ పరమశివుడు నివశించినట్టు స్థానికు చెబుతారు. సాధారణంగా.. శివాలయంలో శివుని విగ్రహానికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది. అయితే.. ఈ ఆలయంలో మాత్రం నందీశ్వరుడు ఉండడు.

1 / 7
కపలేశ్వర్ మహదేవ్ ఆలయంలో నంది విగ్రహం లేకపోవడం వెనుక ఆసక్తికరమైన కథ ఒకటి ఉంది. ఇంద్రసభలో ఒక రోజు బ్రహ్మ, శివుని మధ్య విభేదాలు తలెత్తుతాయి. ఆ సమయంలో బ్రహ్మ తన ఐదు శిరస్సులను ప్రదర్శించగా, వీటిలో నాలుగు వేదాలను పఠించగా, ఒక తల మాత్రం శివుడుని తథేకంగా చూసింది. దీంతో శివుడు ఆ తలను ఖండించాడు. ఇది బ్రాహ్మణ హత్యగా..  దోషంగా మారింది. ఈ దోషాన్ని నివృత్తి చేసుకునేందుకు పరమశివుడు ప్రపంచ పర్యటన చేపట్టారు.

2 / 7
శివుడు దోష పరిహారం కోసం భూలోకం మొత్తం పర్యటించినప్పటికీ  దోష నివృత్తి పొందలేక పోయారు.అలా  పర్యటిస్తున్న శివుడు  సోమేశ్వరం అనే స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో ఓ గోవు... బ్రాహ్మణుడిని తన కొమ్ములతో పొడిచి బ్రహ్మహత్యకు గురి చేసిన తన దూడకు పరిహార నివృత్తిని చెప్పడాన్ని పరమేశ్వరుడు గమనించాడు.

3 / 7
బ్రహ్మహత్య దోషానికి గురైన ఆ గోవు పరిహారం కోసం వెళ్లే మార్గాన్ని పరమేశ్వరుడు అనుకరించారు. పంచవటి సమీపానికి చేరుకున్న వెంటెనే గోదావరి నదిలో ఆ గోవులు స్నానమాచరించి. తమ బ్రహ్మహత్య దోషాన్ని తొలగించుకున్నాయి. అదే ప్రాంతంలో పరమేశ్వరుడునూ స్నానమాచరించి తన బ్రహ్మహత్యను పోగొట్టుకున్నారని శాస్త్రాలు చెబుతున్నాయి.

4 / 7
అనంతరం శివుడు సమీపంలో ఉన్న కొండపై ఆసీనులయ్యారు. గోవు ఆయన ముందు మోకాలితో కూర్చొంది. అయితే తన బ్రహ్మహత్య దోష నివారణకు గురువుగా దోహదం చేసిన గోవు తన ముందు మోకాటి దండ వేసి ఆశీనులైంది. దీన్ని పరమేశ్వరుడు అంగీకరించకపోవడంతో ఈ ఆలయంలో నంది విగ్రహాన్ని ప్రతిష్టించబడలేదని పెద్దలు చెబుతున్నారు.

5 / 7
ఈ ఆలయ సమీపంలో ఉన్న గోదావరి నదిలో "శ్రీరాముడు" ఆయన తండ్రి దశరథ మహారాజును స్మరించి పితృపూజను గావించినట్లు ప్రతీతి ఉండటంతో... వేలకొలది భక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శించి పితృదేవతలకు పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా శ్రావణ మాసంతో సహా, ప్రతి సోమవారం ఇక్కడకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు.

6 / 7
ఈ ప్రాంతానికి చేరుకోవడానికి రోడ్ , రైలు మార్గాలున్నాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబై నుంచి 160 కిలోమీటర్ల దూరంలో నాశిక్ ఉంది.    దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి నాశిక్‌కు రైలు, బస్సు సర్వీసులు ఉన్నాయి.

7 / 7
Follow us
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!

30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..

పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి

మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్

గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా

రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ

ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..

రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..

మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్

మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో