Sleeping: నిద్రపోయేటప్పుడు పక్షులు చెట్లపై నుంచి ఎందుకుపడవో తెలుసా? మాస్టర్‌ మైండ్‌ సీక్రెట్‌..

గాఢనిద్రలో ఉన్నప్పుడు అపస్మారక స్థితిలోకి వెళ్లడం సాధారణం. అంటే నిద్రపోయేటప్పుడు స్పృహ ఉండదు. నిద్రలో మంచం మీద నుంచి కింద పడిన అనుభవాలు మనలో చాలా మందికి ఉన్నాయి. ఐతే చెట్ల కొమ్మలపై నిద్రపోయే పక్షులు మాత్రం నిద్రపోయేటప్పుడు జారి కిందపడవు. ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా?

|

Updated on: Jun 23, 2022 | 1:56 PM

1 / 5
మనం పడుకోగానే కొంత సమయానికే గాఢ నిద్రలోకి జారుకుంటాము. ఆ తర్వాత కలలు కంటాం. ఐతే మనలాగా పక్షలు గాఢ నిద్రలోకి వెళ్లవు.

2 / 5
నిజానికి పక్షులు చెట్ల కొమ్మలపై నిద్రిస్తున్నప్పుడు ఎందుకు నేలమీద పడవు? కింద పడకుండా సమతుల్యంగా ఎలా ఉంచుకుంటాయి? వంటి సమాధానాలు తెలుసుకునే ముందు.. అసలు పక్షులు ఎలా నిద్రపోతాయో తెలుసుకోవాలి.

3 / 5
మరో ముఖ్య విషయం ఏంటంటే పక్షులు నిద్రపోయేటప్పుడు ఒక కన్ను తెరచి నిద్రపోతాయి. పక్షి మెదడులోని ఒక భాగం (ఎడమ లేదా కుడి అర్ధగోళం) నిద్రలో చురుకుగా ఉండే విధంగా నియంత్రిస్తుంది. మెదడు చురుకుగా ఉంటే ఒక కన్ను తెరిచి ఉంటుంది. అంటే ఒకవైపు కన్ను చురుగ్గా ఉంటుంది, మరోవైపు నిద్రపోతుంది.

4 / 5
ఈ విధమైన నిద్ర సామర్థ్యం కారణంగా, పక్షి నిద్రపోతున్నప్పుడు కూడా ఏదైనా ప్రమాదం నుంచి తనను తాను రక్షించుకోగలదు. నిద్రపోతున్నప్పుడు చెట్టు మీద నుంచి పడకపోవడానికి ఒక ప్రధాన కారణం కూడా ఇదే. మరొక కారణం ఏంటంటే.. పక్షుల పాదాల ఆకృతి. పక్షుల పాదాల నిర్మాణం ఒక వస్తువును గట్టిగా పట్టుకోగలిగేలా ఉంటుంది. నిద్రపోతున్నప్పుడు, వాటి పాదాల వేళ్లు చెట్టు కొమ్మలను గట్టిగా బిగించి, తాళం వేసినట్టు పట్టుకుంటాయి. అందుకే నిద్ర సమయంలో కూడా పక్షులు చెట్టుపై నుంచి కింద పడవు.

5 / 5
Follow us