Egg Shells for Skin: గుడ్డు పెంకులతో ఈ చర్మ సమస్యలకు బైబై చెప్పేయండి..

|

Nov 23, 2024 | 1:07 PM

కోడిగుడ్డు పెంకులను ఉపయోగించడం వల్ల అనేక రకాల చర్మ సమస్యలను కంట్రోల్ చేసుకోవచ్చు. గుడ్డు పెంకులతో మొక్కలకు పోషకాలు అందించడమే కాకుండా చర్మ సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు..

1 / 5
కోడి గుడ్ల పెంకులతో చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. గుడ్డులోనే కాకుండా గుడ్డు పెంకుల్లో కూడా పోషకాలు లభిస్తాయి. ఎక్కువగా గుడ్డు పెంకులను మొక్కలు బాగా పెరిగేందుకు ఉపయోగిస్తారు. కానీ గుడ్డు పెంకులతో చర్మ సమస్యలను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. మరి ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం.

2 / 5
గుడ్డు పెంకులను శుభ్రంగా కడిగి ఎండలో ఎండబెట్టాలి. ఆ తర్వాత చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి పొడిలా చేసుకోవాలి. ఈ పొడిలో తేనె కలిపి ముఖంపై రాస్తే ఎలాంటి మచ్చలను అయినా తగ్గుతాయి. తక్కువ సమయంలోనే మంచి ఫలితం కనిపిస్తుంది.

3 / 5
మరో టిప్ ఏంటంటే.. గుడ్డు పెంకుల పొడిని ఒక బౌల్‌లోకి తీసుకోండి. ఆ తర్వాత ఇందులోనే యాపిల్ సైడర్ వెనిగర్ మిశ్రమాన్ని కలపండి. ఈ మిశ్రమాన్ని పేస్టులా చేయాలి. ఇందులో దూది ముంచి.. చర్మంపై రాయడం వల్ల మంట, వాపులు, దురద సమస్య కంట్రోల్ అవుతుంది.

4 / 5
గుడ్డు పెంకులతో స్క్రబ్ కూడా చేసుకోవచ్చు. గుడ్డు పెంకుల పొడిలో కొద్దిగా పంచదార కలిపి.. పేస్టులా చేసుకోవాలి. దీన్ని కొద్దిగా ముఖంపై రాసి స్క్రబ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే దుమ్ము, ధూళి, డెడ్ స్కిన్ సెల్స్, బ్లాక్ హెడ్స్ పోతాయి.

5 / 5
ఈ గుడ్డు పెంకుల పొడిలోనే కొద్దిగా బెల్లం పొడి మిక్స్ చేసి.. ముఖం అంతా రాసుకోవాలి. ఓ పావు గంట తర్వాత ముఖంపై చేతులు రుద్దుతూ కడగాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే మురికిపోయి కాంతివంతంగా తయారవుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

ఈ గుడ్డు పెంకుల పొడిలోనే కొద్దిగా బెల్లం పొడి మిక్స్ చేసి.. ముఖం అంతా రాసుకోవాలి. ఓ పావు గంట తర్వాత ముఖంపై చేతులు రుద్దుతూ కడగాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే మురికిపోయి కాంతివంతంగా తయారవుతుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)