అన్నం vs చపాతీ.. గుండె ఆరోగ్యానికి ఏది మంచిది..? తినేముందు ఇవి తెలుసుకోండి..

Updated on: May 09, 2026 | 1:51 PM

Rice vs Roti: భారతీయ భోజన ప్రియుల మధ్య దశాబ్దాలుగా నడుస్తున్న పెద్ద చర్చ.. అన్నం తింటే మంచిదా? లేక రోటీనా?. ముఖ్యంగా గుండె జబ్బులు, మధుమేహం, అధిక బరువు వంటి సమస్యలు పెరుగుతున్న నేటి కాలంలో, మనం తీసుకునే ఈ ప్రధాన ఆహారాల పాత్ర అత్యంత కీలకంగా మారింది. గుండె ధమనులను ఆరోగ్యంగా ఉంచడంలో ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రభావం చూపుతుందో శాస్త్రీయ కోణంలో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
పీచు పదార్థం: గుండె రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉండాలంటే ఆహారంలో పీచు పదార్థం అధికంగా ఉండాలి. పొట్టు తీయని గోధుమ పిండితో చేసే రోటీలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను పీల్చుకుని బయటకు పంపడంలో సహాయపడుతుంది. పాలిష్ చేసిన తెల్ల బియ్యంలో పీచు పదార్థం దాదాపు శూన్యం. ఇది కేవలం పిండి పదార్థంగా మారి శరీరంలో కొవ్వు నిల్వలు పెరగడానికి కారణమవుతుంది. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా బ్రౌన్ రైస్ వాడితే ఫైబర్ పొందవచ్చు.

2 / 5
గ్లైసెమిక్ ఇండెక్స్: గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మనం తిన్న ఆహారం ఎంత వేగంగా రక్తంలో చక్కెరను కలుపుతుందో తెలిపే కొలమానం. రైస్ దీని GI చాలా ఎక్కువ. ఇది తిన్న వెంటనే ఇన్సులిన్ స్థాయిలను అమాంతం పెంచుతుంది. ఇది గుండె సంబంధిత వ్యాధులకు దారితీసే మెటబాలిక్ సిండ్రోమ్ ముప్పును పెంచుతుంది. రోటి GI సాపేక్షంగా తక్కువ. ఇది నిదానంగా శక్తిని విడుదల చేయడం వల్ల గుండెపై ఒత్తిడి తగ్గుతుంది మరియు రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది.

3 / 5
ఖనిజాలు:  గుండె లయ తప్పకుండా కొట్టుకోవడానికి, రక్తపోటును నియంత్రించడానికి మెగ్నీషియం చాలా అవసరం. బియ్యంతో పోలిస్తే గోధుమలలో మెగ్నీషియం, పొటాషియం పాళ్లు చాలా ఎక్కువ. ఇవి రక్తనాళాల కండరాలను సడలించి, రక్త ప్రసరణ సాఫీగా సాగేలా చేస్తాయి. అయితే  రోటీ విషయంలో ఒక చిన్న హెచ్చరిక ఉంది. బియ్యం సహజంగా తక్కువ సోడియం కలిగి ఉంటుంది. కానీ చాలామంది రోటీ పిండి కలిపేటప్పుడు ఉప్పు వేస్తారు. హై బీపీ లేదా గుండె సమస్యలు ఉన్నవారు రోటీలో అదనపు ఉప్పు వేయడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ. కాబట్టి నో సాల్ట్ రోటీ ఉత్తమ ఎంపిక.

4 / 5
బరువు నియంత్రణ - హార్ట్ లోడ్:  అధిక బరువు గుండెపై అదనపు భారాన్ని పెంచుతుంది. అన్నం త్వరగా అరిగిపోవడంతో మళ్లీ ఆకలి వేస్తుంది, దీనివల్ల మనం ఎక్కువ కేలరీలు తీసుకుంటాం. రోటీలోని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు అరగడానికి సమయం పడుతుంది, తద్వారా ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి రోటీయే సరైన నేస్తం.

5 / 5
మల్టీగ్రెయిన్ మంత్రం: కేవలం గోధుమలకే పరిమితం కాకుండా.. జొన్నలు, సజ్జలు, రాగులు లేదా ఓట్స్ కలిపిన పిండితో రోటీలు చేసుకోండి. ఇవి గుండె ధమనులను శుభ్రంగా ఉంచడానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. మీరు అన్నం లేకుండా ఉండలేకపోతే తెల్ల బియ్యం బదులు బ్రౌన్ రైస్ వాడండి. అన్నం వండేటప్పుడు అందులో ఎక్కువ కూరగాయలు కలిపి వెజిటబుల్ పులావ్ లాగా తీసుకోవడం వల్ల పోషక విలువలు పెరుగుతాయి. అన్నం తిన్నా, రోటీ తిన్నా.. మీ ప్లేట్‌లో సగం భాగం కేవలం ఆకుకూరలు, కూరగాయలు, పప్పు ఉండేలా చూసుకోండి.

Follow Us