Amit Shah in Kairana: ఉత్తరప్రదేశ్‌లో ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అడిగిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. చిత్రాలు

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.

|

Updated on: Jan 22, 2022 | 8:54 PM

భారత మినీ సంగ్రామం..  5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరంలో రాజకీయ పార్టీల ప్రచారం జోరందుకుంది. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

1 / 8
పశ్చిమ యూపీలోని కైరానాలో శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. యూపీలో అసెంబ్లీ ఎన్నికల ప్రకటన తర్వాత అమిత్ షా రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి.

2 / 8
షామ్లీ జిల్లాలోని కైరానా అసెంబ్లీ స్థానం నుంచి అమిత్ షా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక్కడి నుంచి మాజీ ఎంపీ హుకుమ్ సింగ్ కుమార్తె మృగాంక సింగ్‌కు బీజేపీ టిక్కెట్టు ఇచ్చింది. మతపరమైన ఉద్రిక్తత కారణంగా, ఇక్కడి హిందువులు తమ ఇళ్లను అమ్మి వలస వెళ్లవలసి వచ్చిందని ఆమిత్ షా ఆరోపించారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కైరానా నుంచి వలసలు పెద్ద సమస్యగా మారాయి. వలస వెళ్లిన వారు తిరిగి వచ్చేలా చేస్తామన్నారు అమిత్ షా.

3 / 8
అమిత్ షా తన కైరానా పర్యటన సందర్భంగా శనివారం షామ్లీ, బాగ్‌పత్‌లో పార్టీ కార్యకర్తలు, ఆ ప్రాంత కార్యాలయ బేరర్‌లతో సమావేశం అయ్యారు.

4 / 8
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వ్యూహరచనలో కీలక పాత్ర పోషిస్తున్న షా తర్వాత మీరట్‌లో కూడా పర్యటించనున్నారు. అక్కడ పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించడమే కాకుండా అక్కడి ప్రముఖులతోనూ సమావేశమవుతున్నారు.

5 / 8
షా తన మొదటి ఎన్నికల పర్యటనలో కైరానా పర్యటనకు కూడా గొప్ప రాజకీయ ప్రాధాన్యత ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెందిన కైరానా ఎంపీ దివంగత హుకుమ్ సింగ్ ఇక్కడి నుంచి హిందువుల వలస అంశాన్ని లేవనెత్తారు. కైరానా మైనారిటీ ప్రాబల్యం ఉన్న ప్రాంతం కావడం విశేషం.

6 / 8
ఉత్తరప్రదేశ్‌లో జనవరి 8న అసెంబ్లీ ఎన్నికలను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఫిబ్రవరి 10న పశ్చిమ యూపీలోని 11 జిల్లాల్లో మొదటి దశలో 58 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.

7 / 8
మతపరమైన ఉద్రిక్తత కారణంగా, ఇక్కడి హిందువులు తమ ఇళ్లను అమ్మి వలస వెళ్లవలసి వచ్చిందని ఆమిత్ షా ఆరోపించారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కైరానా నుంచి వలసలు పెద్ద సమస్యగా మారాయి. వలస వెళ్లిన వారు తిరిగి వచ్చేలా చేస్తామన్నారు అమిత్ షా.

8 / 8
Follow us