Kitchen Hacks: చపాతీలను ఇలా చేశారంటే టైమ్, గ్యాస్ కూడా సేవ్ అవుతాయి..
చపాతీలను తినడం ఎంత రుచిగా ఉంటాయో.. చేయడం కోసం కాస్త కష్ట పడాల్సిందే. పిండి కలిపి.. చపాతీలు చేసి.. కాల్చాలి. చపాతీలు చేయడానికి కాస్త సమయం పడుతుంది. కానీ ఇప్పుడు చెప్పినట్టు చేశారంటే గ్యాస్, టైమ్ రెండూ సేవ్ అవుతాయి. అదెలాగో చూసేయండి..
Updated on: Jan 18, 2025 | 7:20 PM

చపాతీ అంటే చాలా మందికి ఇష్టమైన ఫుడ్. చపాతీలో ఎలాంటి కర్రీ అయినా తిన్నా చాలా రుచిగా ఉంటుంది. చపాతీ ఆరోగ్యానికి కూడా మంచిదని చాలా మంది ఈ మధ్య కాలంలో చపాతీలు తింటూ ఉంటారు. చపాతీలు తినడం ఆరోగ్యానికి కూడా మంచిదే.

బరువు తగ్గడం కోసం చాలా మంది రాత్రి పూట చపాతీలను తింటున్నారు. ఈ చలి కాలంలో వేడి వేడిగా చపాతీలు తింటే ఆహా ఆ రుచే వేరు. అయితే సాధారణంగా ఇంట్లో చపాతీలు చేసే విధానం వేరు. కానీ ఇప్పుడు చెప్పిన విధంగా చేస్తే.. టైమ్, గ్యాస్ రెండూ సేవ్ అవుతాయి.

ఎప్పుడూ కలుపుకునే విధంగా చపాతీ ముద్దని తయారు చేసుకోవాలి. ఉండలు ఉండలుగా కాకుండా ఒకటే సారి చపాతీ ముద్దను తీసుకోండి. చపాతీలను ఒకటేసారి చేసి.. ఒక దాని మీద మరొకటి పెట్టండి.

ఒకదాని మీద మరొకటి పెడితే అంటుకుంటాయి కాబట్టి.. పిండి లేదా ఆయిల్ రాయండి. దీని వల్ల అంటుకోవు. ఇలా ఐదారు చేసుకున్న తర్వాత పెనం వేడి చేయండి.

ఇప్పుడు ఈ చపాతీలను ఒకటే సారి పాన్ మీద వేయండి. అటూ ఇటూ తిప్పుతూ ఒక్కొక్క చపాతీని కాల్చుకోండి. ఇలా చేయడం వల్ల గ్యాస్, సమయం రెండూ సేవ్ అవుతాయి.





























