
ఈ మధ్య మెలోడీ చాక్లెట్ ఎక్కువ ట్రెండ్ అవుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి మెలోడి చాక్లెట్ గిఫ్ట్‌గా ఇవ్వడం జరిగింది. ఇక దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో మెలోడీ చాక్లెట్ కూడా చాలా ట్రెండ్ అవుతుంది. దీంతో చాలా మంది ఈ చాక్లెట్ తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే బయట కొనడం కంటే ఈ చాక్లెట్స్ ఇంటిలో చేసుకుంటే బాగుంటుంది. కదా, అందుకే మెలోడీ చాక్లెట్స్ ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్థాలు : కాఫీ పొడి ఐదు టేబుల్ స్పూన్స్, వెన్న రెండు టేబుల్ స్పూన్స్, మిల్క్ అర లీటర్, గోరు వెచ్చటి పాలు, వెనిలా ఎసెన్స్, నెయ్యి వన్ టీ స్పూన్, పంచదార.

తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా స్టవ్ ఆన్ చేసి, మందపాటి కడాయి పెట్టి పంచదార వెయ్యాలి. చిన్న మంటపై పంచదార కరిగి గోల్డెన్ బ్రౌన్ రాగానే ఆపేయ్యాలి. మాడితే చేదుగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వెంటనే క్రీమ్, వెన్న వెసి, గరిటెతో గట్టిగా తిప్పుతూ ఉండాలి. నురగలా వచ్చి అది తగ్గిపోతుంది. ద్రావణం చిక్కగా వస్తుంది.

ఇప్పుడు అందులో మిల్క్ పొడర్ కోక పౌడర్ వేసి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. తర్వాత వెనిలా ఎసెన్స్ వేయాలి. దీని వలన చాక్లెట్స్‌కు మంచి ప్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్ తీసుకొని దానికి అంచున నెయ్యి రాసి, అందులో వేయాలి.

తర్వాత అది చూట్టూ స్ప్రెడ్ అయినత ర్వాత దానిని చిన్న చిన్నని చాక్లెట్స్ ఆకారంలో కట్ చేసుకోవాలి. దీనిని ఫ్రిజ్‌లో దాదాపు రెండు గంటలు పెట్టిన తర్వాత చాక్‌కు నెయ్యి రాసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, బటర్ పేపర్‌లో చుట్టేయ్యాలి. అంతే టేస్టీ టేస్టీ మెలోడీ చాక్లెట్స్ రెడీ.