
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు రోజు రోజుకు విపరీతంగా పెపరుగుతున్నాయి. ఇప్పటికే ఒక్కో సిలిండర్‌కు రూ29 పెంచారు. అయితే ఈ పరిస్థితుల్లో గ్యాస్‌ను ఆదా చేసుకోవాల్సిన అవసరం చాలా ఉందని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా సిలిండర్ ఎక్కువ కాలం వచ్చేలా వంటలు చేసుకోవాలి. ముఖ్యంగా కొన్ని రకాల వంటకాలను అస్సలే గ్యాస్ స్టవ్ పై వండకూడదంట. అవి ఏవో ఇప్పుడు చూసేద్దాం.

రాజ్మా, చిక్కుడు గింజల కర్రీ : చాలా మంది ఎక్కువగా వండే వాటిలో రాజ్మా వంటకం ముందుంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే కనీసం వారానికి ఒక్కసారి అయినా ఈ వంటకం చేస్తుంటారు. అయితే ఇది ఉడకడానికి చాలా సమయం పడుతుంది. గట్టిగా ఉండటం వలన చాలా లేట్ అవుతుంది, గ్యాస్ ఎక్కువగా అవసరం అవుతుంది. అందువలన దీనిని చాలా తక్కువగా వండుకోవడం లేదా, కట్టెలపొయ్యిపై వండటం చేయడం వలన గ్యాస్ ఆదా చేసుకోవచ్చునంట.

శనగల గ్రేవీ : శనగలను ఉడకబెట్టి ఈ వంటకాన్ని ప్రిపేర్ చేస్తుంటారు. అయితే ఇవి ఉడకడానికి కూడా చాలా సమయం పడుతుంది. ఇది వండాలి అనుకునే వారు దీనిని ఎక్కువగా నానబెట్టాలంట. లేకపోతే గ్యాస్ ఎక్కువగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. వీలైనంత వరకు దీనిని వారానికి లేదా రెండు వారాలకు ఒకసారి వండుకోవడం వలన చాలా గ్యాస్ ఆదా చేయవచ్చు అని చెబుతున్నారు నిపుణులు.

బిర్యానీ : చాలా మంది ఫేవరెట్ బిర్యానీ, ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే బిర్యానీ తప్పకుండా ఉండాల్సిందే. ఇది మాంసం ఉండికి, రైస్ మళ్లీ ప్రత్యేకంగా ఉడకబెట్టడానికి చాలా సమయం తీసుకుంటుంది. అందువలన బిర్యానీనీ వండే ముందు ప్రెషర్ కుక్కర్ ఉపయోగించడం మంచిది. అలాగే బియ్యాన్ని నానబెట్టడం వలన రైస్ త్వరగా ఉడుకుతుంది. అయితే దీనిని ప్రిపేర్ చేయడానికి గ్యాస్ ఎక్కువ కావాలి కాబట్టి, చాలా అవసరం ఉన్నప్పుడు మాత్రమే దీనిని ప్రిపేర్ చేసుకోవాలి.

అంతే కాకుండా వేయించిన ఆహారాలు కూడా పదే పదే చేయడం తగ్గించాలంట. ఎప్పుడు అయినా సరే పప్పుల వంటివి వండాలి అనుకుంటే వాటిని ఒక రోజు ముందు నానబెట్టడం మంచిది అని చెబుతున్నారు నిపుణులు. అలాగే ప్రెషర్ కుక్కర్ ఉపయోగించి పప్పులు, మాంసం ఉడకబెట్టి వంట చేసుకోవాలి. దీని వలన గ్యాస్ ఆదా అవుతుంది. అంతే కాకుండా ఫ్రిజ్ నుంచి తీసి వెంటనే గుడ్లు, మాంసం, కూరగాయలు వండకూడదు. ఫ్రిజ్ నుంచి తీసిన 10 నిమిషాల తర్వాత వండటం వలన గ్యాస్ ఎక్కువ కాలం వస్తుందంట.