AP Rains: అల్పపీడనం అలెర్ట్.. ఏపీలో పిడుగులతో భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్

|

Aug 30, 2024 | 8:15 PM

ఐఎండీ సూచనల ప్రకారం పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం బలపడిందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఇది రాగల 36 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తరాంధ్ర..

1 / 5
ఐఎండీ సూచనల ప్రకారం పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం బలపడిందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఇది రాగల 36 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తరాంధ్ర, దక్షిణఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో శనివారం అక్కడక్కడ భారీ వర్షాలు, ఆదివారం అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలినచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు.

2 / 5
రేపు కోస్తాతీరం వెంబడి గంటకు 45-65 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

3 / 5
వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు. కృష్ణానది వరద ప్రవాహం దిగువకు విడుదల చేస్తున్నందున నదీ పరివాహాక ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నది,వాగులు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు.

4 / 5
31 ఆగష్టు, శనివారం: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైయస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

5 / 5
01 సెప్టెంబర్, ఆదివారం: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, గుంటూరు, బాపట్ల పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.