Kieron Pollard: ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు.. పొట్టి ప్రపంచకప్ లో ఆసీస్‌కు ముచ్చెమటలు.. పొలార్డ్‌ రికార్డులు మాములుగా లేవుగా..

Kieron Pollard Retirement:వెస్టిండీస్‌కు చెందిన పొలార్డ్‌ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

| Edited By: Phani CH

Updated on: Apr 21, 2022 | 9:46 AM

अబ్యాట్‌తో పాటు బాల్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన వెస్టిండీస్ స్టార్‌ ఆల్‌రౌండర్‌ తన సంచలన నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు.  అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం IPLలో ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్న పొలార్డ్ ఇప్పటివరకు వెస్టిండీస్ పరిమిత ఓవర్ల జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌కు ముందు అనూహ్యనిర్ణయం తీసుకున్నాడు. ఈ సందర్భంగా అతని కెరీర్‌లోని విశేషాలను ఒకసారి చూద్దాం.

1 / 6
అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టడం అంతసులభమేమీకాదు. అయితే పొలార్డ్‌ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు.  గతేడాది మార్చి 4న శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో అతను ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా అరుదైన రికార్డు సృష్టించాడు.  అతని కంటే ముందు భారత్‌కు చెందిన యువరాజ్ సింగ్, దక్షిణాఫ్రికాకు చెందిన హెర్షెల్‌ గిబ్స్‌ మాత్రమే ఆరు బంతులకు ఆరు సిక్సర్లు బాదారు.

2 / 6
అయితే ఈ మ్యాచ్‌లో ఓ ప్రత్యేకత చోటుచేసుకుంది. శ్రీలంక స్పిన్నర్ అకిల ధనంజయ హ్యాట్రిక్‌ వికెట్లు తీసి మంచి జోరుమీదున్నాడు. అయితే క్రీజులోకి వచ్చిన పొలార్డ్ ఈ స్పిన్నర్‌ బౌలింగ్‌లో వరుసగా ఆరు సిక్సర్లు బాదాడు.

3 / 6
డారెన్ సామీ సారథ్యంలో వెస్టిండీస్ జట్టు 2012, 2016లో టీ20 ప్రపంచకప్‌లను గెలుచుకుంది. 2012 ప్రపంచకప్‌ గెల్చుకున్న జట్టులో పొలార్డ్  సభ్యుడు. ఈ ప్రపంచ కప్ సెమీ ఫైనల్‌లో అతను ఆస్ట్రేలియాపై 15 బంతుల్లోనే 38 పరుగులు చేసి తన జట్టు స్కోరును 200 పరుగులు దాటించాడు.  ఇదే మ్యాచ్లోనూ బంతితోనూ అద్భుతాలు చేశాడు. ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేసి ఆరు పరుగులిచ్చి రెండు వికెట్లు తీసి కంగారూలను కోలుకోలేని దెబ్బ తీశాడు

4 / 6
పొలార్డ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టినప్పుడు అతనిని వన్డే స్పెషలిస్ట్‌గా భావించారు. అందుకు తగ్గట్లే బ్యాటింగ్‌తో పాటు బంతితోనూ అద్భుతాలు సృష్టించాడు. కరేబియన్‌ జట్టులో కీలక ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

5 / 6
ఐపీఎలో ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న పొలార్డ్ ఎన్నో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ లు ఆడాడు.

6 / 6
Follow us