Onion Garlic Peels: ఉల్లి, వెల్లుల్లి తొక్కలతో ఎన్ని ఉపయోగాలో.. డోంట్ మిస్!
మన ఇంట్లో ఉండే చెత్తతోనే ఎరువు తయారు చేసుకోవచ్చు. కానీ ఎలా వాడాలో తెలీక చాలా మంది పడేస్తూ ఉంటారు. వీటిల్లో వెల్లుల్లి, ఉల్లిపాయల తొక్కలు కూడా ఒకటి. వీటిని ఉపయోగించి ఎరువుగా, చర్మానికి, జుట్టుకు అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు. అదెలాగో చూసేయండి..
Updated on: Jan 18, 2025 | 8:14 PM

ప్రతి రోజూ వంట కోసం ఉల్లిపాయల్ని కట్ చేస్తూ ఉంటారు. వంట కోసం రోజుకు ఉల్లిపాయలు ఎక్కువే అవుతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం వెల్లుల్లి తొక్కలను కూడా తీస్తూ ఉంటారు. సాధారణంగా ఈ తొక్కల్ని పడేస్తూ ఉంటారు. కానీ వీటితో ఉండే ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు.

ఉల్లి, వెల్లుల్లి తొక్కల్ని అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. వీటిని సేంద్రీయ ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. తొక్కలను పడేయకుండా నీటిలో లేదా మజ్జిగలో వేసి రెండు రోజులు పక్కన పెట్టండి. ఇప్పుడు దీన్ని మొక్కలకు పోస్తే పోషకాలు అందుతాయి.

రాత్రాంతా ఈ తొక్కల్ని నీటిలో నానబెట్టి.. ఉదయాన్నే మొక్కలకు పోస్తే.. మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ ఉల్లి తొక్కల్ని నీటిల మరిగించి.. చల్లారాక ముఖం కడుక్కుంటే టోనర్‌లా పని చేస్తాయి. చర్మానికి మేలు చేస్తుంది.

ఈ తొక్కలతో జుట్టు ఆరోగ్యాన్ని కూడా పెంచుకోవచ్చు. ఉల్లి, వెల్లుల్లి తొక్కలు నీటిలో వేసి మరిగించి.. చల్లారాక తలస్నానం చేస్తే.. జుట్టుకు కండీషనర్‌లా ఉపయోగ పడి.. జుట్టు మెరుస్తుంది.

వెల్లుల్లి తొక్కల్ని ఇంట్లో కాల్చడం వల్ల దోమలు పారిపోతాయి. ఓ పెంకు తీసుకుని అందులో వెల్లుల్లి తొక్కలు వేసి కాల్చండి. ఈ పొగకు దోమలు బయటకు పోతాయి. ఉల్లి, వెల్లుల్లి తొక్కల్ని శుభ్రంగా కడిగి.. సూప్ స్టాక్స్‌లా కూడా ఉపయోగించవచ్చు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)





























