Heart Health: నిద్రలేమి గుండెపై తీవ్ర ప్రభావం.. రోజు ఏ సమయానికి నిద్రించాలి..?

గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని నివారించడానికి, నిద్రకు సంబంధం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. శాస్త్రవేత్తలు నిర్వహించిన పలు పరిశోధనలలో పలు విషయాలు..

|

Updated on: Dec 04, 2022 | 8:00 PM

గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని నివారించడానికి, నిద్రకు సంబంధం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. శాస్త్రవేత్తలు నిర్వహించిన పలు పరిశోధనలలో పలు విషయాలు వెల్లడయ్యాయి. మన నిద్ర గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందంటున్నారు. సరైన నిద్రలేని కారణంగా స్ట్రోక్‌ వచ్చే అవకాశాలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

1 / 6
ఇటీవల జరిపిన పరిశోధనలలో పలు విషయాలు వెలుగు చూశాయి. ఈ పరిశోధన నివేదిక యూరోపియన్‌ హార్ట్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ ఎక్సెటర్‌ పరిశోధకులు నిర్వహించిన పరిశోధనలలో నిద్రకు, గుండె ఆరోగ్యానికి ఉన్న సంబంధాన్ని తెలియజేశారు. వీరి పరిశోధనల ప్రకారం.. అర్ధరాత్రి లేదా, చాలా ఆలస్యంగా నిద్రపోతే గుండె ఆరోగ్యాన్ని దెబ్బతిస్తుందని గుర్తించారు. త్వరగా సమయానుకూలంగా నిద్రించడం వల్ల గుండెకు ఎంతో మేలని, గుండెకు సంబంధించిన ప్రమాదాలను తగ్గించుకోవచ్చంటున్నారు.

2 / 6
సరైన నిద్రపోవడం వల్ల శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీనిని సిర్కాడియన్ రిథమ్ అంటారు. రోజు ఆలస్యంగా నిద్రపోవడం వల్ల సిర్కాడియన్‌ రిథమ్‌ దిగజారుతుంది. దీనిని మరింతగా మెరుగుపర్చాలంటే రాత్రి 10-11 గంటల మధ్య నిద్రపోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

3 / 6
ముఖ్యంగా ఆలస్యంగా నిద్రపోయే మహిళలు ఈ సమయాలను పాటించడం చాలా అవసరమని చెబుతున్నారు. ఆలస్యంగా నిద్రించేవారు ఉదయం వేళ ఆలస్యంగా మేల్కొంటారు. ఫలితంగా వారిలో జీవ గడియారం వేళలు మారుతాయి. ఇది గుండెపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. రాత్రిపూట త్వరగా నిద్రపోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

4 / 6
88 వేల మందిపై పరిశోధన: పరిశోధనలలో భాగంగా పరిశోధకులు 43 నుంచి 75 ఏళ్ల మధ్య ఉన్న 88 వేల మంది బ్రిటీష్‌ పెద్దలపై పరిశోధనలు చేశారు. ఇందులో వారు నిద్రించే సమయాలు, జీవనశైలికి సంబంధించిన అంశాలతో బేరీజు వేసుకున్నారు. ఈ పరిశోధనలలో ఆలస్యంగా నిద్రపోయే వారిలో గుండె జబ్బులు, గుండె పోటు, స్ట్రోక్‌, హార్ట్‌ ఫెయిల్యూర్‌ వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు గుర్తించారు.

5 / 6
రాత్రి 10-11 గంటల మధ్య నిద్రపోయే వారిలో గుండె జబ్బులు తక్కువగా వస్తున్నట్లు గుర్తించారు. ఇక అర్ధరాత్రి తర్వాత నిద్రిపోయే వారిలో 25 శాతం ఎక్కువగా గుండె జబ్బులు వచ్చే అవకాశాలున్నాయ్ని పరిశోధకులు స్పష్టం చేశారు.

6 / 6
Follow us
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..

మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!

SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్

ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం

ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే

కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..

వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?

అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..