సి విటమిన్ విరివిగా లభించే ఉసిరితో.. ఈ ప్రయోజనాలు తెలిస్తే లొట్టలు వేయాల్సిందే..

Ganesh Mudavath

Ganesh Mudavath |

Updated on: Dec 09, 2022 | 8:13 PM

ఉసిరికాయ.. ఒక్కటి తీసుకున్నా చాలు. శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు అందుతాయి. ఆయుర్వేదంలోనూ విశేషంగా ఉపయోగించిన ఉసిరితో కలిగే ప్రయోజనాల గురించి చెప్పాలంటే మాటలు చాలవు. ఉసిరిని చర్మం, జుట్టు, ఆరోగ్యానికి చాలా ఉపయోగకారిగా భావిస్తారు. ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్-సీ ఎక్కువగా ఉంటుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచడమే కాకుండా, శరీరానికి అంటి పెట్టుకుని ఉన్న దుమ్ముదూళీ కణాలను దూరం చేస్తుంది. ....

Dec 09, 2022 | 8:13 PM
ముఖాన్ని రిఫ్రెష్ చేయడానికి కూడా ఉసిరి ఉపకరిస్తుంది. ఉసిరిని వివిధ రకాలైన కాస్మొటిక్స్ తయారీలో ఉపయోగిస్తారు. కాస్మొటిక్స్ ను నిత్యం ఉపయోగించడం వల్ల చర్మానికి సమస్యలు వస్తాయి. మెరిసే చర్మం కోసం ఉసిరి, పెరుగు, తేనెతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకోండి. రెండు చెంచాల ఉసిరి పొడిని ఒక చెంచా పెరుగు, ఒక చెంచా తేనెతో కలపండి. దీన్ని బాగా కలిపి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత కడిగేస్తే చాలు.

1 / 5
ఉసిరిని చర్మంపై రుద్దుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం ఒక గిన్నె తీసుకుని అందులో ఒక చెంచా ఉసిరి పొడి, అర చెంచా పంచదార, ఒక చెంచా రోజ్ వాటర్ కలపాలి. సున్నితంగా దానిని స్క్రబ్ చేసిన తర్వాత మీ ముఖాన్ని కడగాలి. ఇలా చేయడం వల్ల చర్మం ఎక్స్‌ఫోలియేట్ అవుతుంది ఇంకా చనిపోయిన చర్మ కణాలను చర్మం నుంచి తొలగిపోతాయి.

2 / 5
మొటిమల మచ్చలు తొలగించడమే కాక అవి రాకుండా చేయడంలో ఉపయోగపడుతుంది. ఫేస్ మాయిశ్చరైజింగ్ మాస్క్‌ను తయారు చేయడానికి అలోవెరా జెల్‌కు ఉసిరి రసాన్ని కలపాలి. కావాలంటే ఉసిరి పొడిని కూడా దీనిలో ఉపయోగించవచ్చు. రెండింటినీ మిక్స్ చేసి ముఖానికి పట్టించండి. ఓ 15 నిమిషాల తర్వాత కడిగేయాలి.

3 / 5
చర్మాన్ని శుభ్రపరచడానికి ఉసిరి,  బొప్పాయి కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. 2 టీస్పూన్ల ఉసిరి రసం తీసుకుని అందులో 2 టీస్పూన్ల బొప్పాయి గుజ్జును కలపాలి. రెండింటినీ మిక్స్ చేసి ముఖానికి రాయాలి. ఆపై 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. మీరు వారానికి ఒకసారి ఇలా చేసుకోవచ్చు. తద్వారా నిత్యం మెరిసేలా మీ ముఖం కనిపిస్తుంది.

4 / 5
ఉసిరి రసంలో దూదిని ముంచి ముఖానికి టోనర్ లాగా అప్లై చేయాలి. అయితే, ఇలా చేయడాన్ని రోజువారీ చేయకండి. అందుకు బదులుగా వారానికి 2, 3 సార్లు మాత్రమే చేస్తే చాలు. ఫలితంగా ముఖంపై మచ్చలు తొలగిపోతాయి.

5 / 5

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu