కేరాఫ్‌ దేవర సక్సెస్‌.. కంటెంట్‌ని నమ్ముకున్న తారక్‌

కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌... ఈ మాట ఇప్పుడు కొత్తగా చెబుతున్నది కాదు. ఎప్పటి నుంచో వింటున్నదే. కాకపోతే ఇప్పుడు మరోసారి ఫ్రెష్‌గా చెబుతున్నారు జనాలు. బాక్సాఫీస్‌ దగ్గర బ్లాక్‌ బస్టర్‌ అవుతున్న సినిమాలను చూసి ఈ మాట అనాలనిపిస్తోంది వాళ్లకు. ఇంతకీ కంటెంట్‌ గురించి కలవరించేలా చేసిన సినిమాలేంటి?

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Phani CH

Updated on: Nov 23, 2024 | 12:27 PM

చిన్నా పెద్దా కొత్తా పాతా, మన, పర  తేడాల్లేవిప్పుడు. కంటెంట్‌ బావుందా? లేదా? ఇదొక్క మాట చాలు... జనాల్లోకి ఇన్‌స్టంట్‌గా మౌత్‌ టాక్‌ వెళ్లిపోవడానికి. దీపావళికి విడుదలైన లక్కీ భాస్కర్‌ కి అలాంటి మౌత్‌ టాక్‌ స్ప్రెడ్‌ అయింది. పాజిటివ్‌ టాక్‌ రావడంతో ఫిదా అయిపోయారు మేకర్స్. బాక్సాఫీస్‌ దగ్గర కాసుల గలగలలు దండిగా వినిపించాయి. సేమ్‌ డేట్‌కి రిలీజ్‌ అయిన అమరన్‌ విషయంలోనూ ఇదే సీన్‌ కనిపించింది.

1 / 5
సినిమా బావుంటే ఒకటీ, రెండూ దాటి.. మూడో వారం కూడా థియేటర్లలో జనాలు సందడి చేస్తున్నారు. అమరన్‌ సినిమా విషయంలో ఇది మరోసారి ప్రూవ్‌ అయింది. ఫ్యామిలీ మొత్తం కట్టగట్టుకుని వెళ్లి సినిమా చూస్తున్నారు.

2 / 5
థ్రిల్లింగ్‌ అంశాలు, మంచి భావోద్వేగాలు, కడుపుబ్బ నవ్వించే సన్నివేశాలు, అనూహ్యమైన ట్విస్టులు, రెండున్నర గంటల సేపు మాయ చేసే కంటెంట్‌ ఉంటే.. చాలు సినిమాను సూపర్‌ హిట్‌ చేసేస్తున్నారు ఆడియన్స్. రీసెంట్‌గా 50 కోట్లను దాటేసిన క విషయంలోనూ ఇదే జరిగింది.

3 / 5
ఎన్టీఆర్‌ నటించిన దేవరకు మార్నింగ్‌ షో పడ్డప్పుడు యునానిమస్‌గా పాజిటివ్‌ టాక్‌ అయితే రాలేదు. కానీ, కంటెంట్‌ చేసిన మేజిక్‌.. దేవర మానియాను కంటిన్యూ చేసింది. 500 క్రోర్స్ ప్లస్‌ కలెక్షన్లతో అద్భుతంగా దూసుకుపోయింది దేవర.

4 / 5
భారీ సినిమాల మధ్య రిలీజ్‌ అయిన హనుమాన్‌ కూడా ఒన్‌ అండ్‌ ఒన్లీ కంటెంట్‌తోనే ప్రూవ్‌ చేసుకుంది. రొటీన్‌కి భిన్నంగా, ప్రేక్షకులకు ఆనందం కలిగించేలా డిజైన్‌ చేసుకున్న ప్లాట్‌కి కాసుల వర్షం కురిసింది. థింక్‌ బిగ్‌... అనేది సినిమా ఇండస్ట్రీలో అందరూ చెప్పే మాటే. థింక్‌ డిఫరెంట్‌ అని అనుకున్న వారికి మాత్రం సక్సెస్‌ ఎదురొచ్చి ఆహ్వానిస్తుందన్నది మళ్లీ మళ్లీ ప్రూవ్‌ అవుతున్న విషయం.

5 / 5
Follow us