Women’s Asia Cup: 76 బంతుల్లో జీరో రన్స్.. టీమిండియా దెబ్బకు గజగజ వణికిన బ్యాటర్స్..

మహిళల ఆసియా కప్ 8వ మ్యాచ్‌లో భారత్ 104 పరుగుల తేడాతో యూఏఈని ఓడించింది. యూఏఈ జట్టు 20 ఓవర్లలో 74 పరుగులు మాత్రమే చేయగలిగింది.

|

Updated on: Oct 05, 2022 | 9:57 AM

మహిళల ఆసియా కప్ 2022లో టీమిండియా అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. సిల్హెట్‌లో జరిగిన మ్యాచ్‌లో యూఏఈ జట్టుపై భారత్ 104 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 178 పరుగులు చేయగా, దానికి సమాధానంగా యూఏఈ జట్టు 74 పరుగులు మాత్రమే చేయగలిగింది.

1 / 5
యూఏఈకి కేవలం 4 వికెట్లు మాత్రమే పడిపోయాయి. ఈ క్రమంలో బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డారు. యూఏఈ జట్టు 76 బంతుల్లో ఒక్క పరుగు కూడా చేయలేదు. అంటే ఈ జట్టు మొత్తం 76 డాట్ బాల్స్ ఆడింది.

2 / 5
భారత్ తరపున అత్యధికంగా 18 డాట్ బాల్స్ వేసిన రేణుకా సింగ్.. స్టార్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. ఆమె తర్వాత పూజా వస్త్రాకర్ బౌలింగ్‌లో 15, స్నేహ రాణా 12 డాట్ బాల్స్ వేశారు.

3 / 5
భారత్ తరపున దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్ అద్భుత అర్ధ సెంచరీలు చేశారు. దీప్తి 49 బంతుల్లో 64 పరుగులు చేసింది. జెమీమా 45 బంతుల్లో 75 పరుగులు చేసింది.

4 / 5
మహిళల ఆసియా కప్‌లో భారత జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో భారత జట్టు 6 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా, పాకిస్థాన్ రెండో స్థానంలో నిలిచింది.

5 / 5
Follow us