Shalini Pandey: పాపం షాలిని.. ఇప్పటికి అర్జున్ రెడ్డి బ్యూటీ గానే సర్వే.! నో ఆఫర్స్..
పాత్ బ్రేకింగ్ సినిమాతో ఎంట్రీ ఇవ్వడం మ్యాటర్ కాదు.. అది మన కెరీర్‌కు ఎంతవరకు యూజ్ అయిందనేది మ్యాటర్. ఆఫర్స్ రానపుడు.. అవకాశాల వేటల వెనకబడినపుడు ఏ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా వృథానే. ఇక్కడ ఓ హీరోయిన్ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. సెన్సేషనల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా.. సింగిల్ ఆఫర్ కోసం వేచి చూస్తున్న ఆ బ్యూటీ ఎవరో తెలుసా..? కొందరు హీరోయిన్లు ఎన్ని సినిమాలు చేసినా మొదటి సినిమా ముద్ర మాత్రం అలాగే ఉండిపోతుంది. అలాంటి బ్యూటీనే షాలిని పాండే.