Anjali: ఇమేజ్ మార్చుకునే పనిలో సీతమ్మ.! అందాల ఆరబోతతో మళ్లీ వస్తున్నా గీతాంజలి.
తెలుగమ్మాయిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన అంజలి, కెరీర్ స్టార్టింగ్‌లో హోమ్లీ ఇమేజ్‌తో ఆకట్టుకున్నారు. కానీ ఆ ఇమేజే అమ్మడి కెరీర్‌ను కష్టాల్లోకి నెట్టింది. తరువాత రూట్ మార్చేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసిన పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు ఈ విషయం మీద సీరియస్‌గా ఫోకస్ చేశారీ సీతమ్మ. 'ఏమో నాకన్నీ అలా తెలిసిపోతుంటాయ్' అని గోదావరి యాసలో ముద్దుముద్దుగా మాట్లాడిన సీత.. ఇప్పుడు పూర్తిగా రూటు మార్చేశారు.