Telugu News » Photo gallery » Cheetahs Return To India, Let Them Make Kuno National Park Their Home Says PM Narendra Modi
Cheetah Project: ఏడు దశాబ్దాల తర్వాత ఇండియాకు.. కునో నేషనల్ పార్క్‌లో చీతాలను విడుదల చేసిన ప్రధాని మోదీ
Ravi Kiran |
Updated on: Sep 17, 2022 | 3:54 PM
భారత వైమానిక దళానికి చెందిన రెండు ఎంఐ-17 హెలికాప్టర్లలో నమీబియా నుంచి ఇండియాకు చీతాలను తీసుకొచ్చారు. నమీబియా నుంచి 8 చీతాలు భారత్‌కు రాగా..
Sep 17, 2022 | 3:54 PM
భారత వైమానిక దళానికి చెందిన రెండు ఎంఐ-17 హెలికాప్టర్లలో నమీబియా నుంచి ఇండియాకు చీతాలను తీసుకొచ్చారు.
నమీబియా నుంచి 8 చీతాలు భారత్‌కు రాగా.. అందులో ఐదు ఆడ, మూడు మగ చీతాలున్నాయి.
ఏడు దశాబ్దాల తర్వాత నమీబియా నుంచి ఈ చీతాలను భారత్‌కు తీసుకొచ్చారు.
అరుదైన వన్య ప్రాణులు చీతాలు 74 సంవత్సరాల తర్వాత భారత్ లో అడుగుపెట్టాయి.
సెప్టెంబర్ 17వ తేదీ ఉదయం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ల్యాండ్ అయ్యింది.
ప్రధాని నరేంద్రమోదీ తన 72వ పుట్టినరోజు సందర్భంగా చీతాలను కునో నేషనల్ పార్క్‌లోకి విడుదల చేశారు.
చీతాలను పార్క్ లోకి వదిలిన అనంతరం.. ప్రధాని మోదీ అక్కడున్న సిబ్బందితో మాటామంతి
పలు విషయాలను వారితో కలిసి పంచుకున్న ప్రధాని మోదీ
ఆ తర్వాత చీతాలను ఫోటోలు తీసిన ప్రధాని నరేంద్ర మోదీ
అంతరించిపోయిన చీతాలు జాతిని పునరుద్ధరించడం కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
1972లో ప్రారంభించబడిన అత్యంత విజయవంతమైన వన్యప్రాణుల సంరక్షణ వెంచర్లలో ఒకటి ‘ప్రాజెక్ట్ టైగర్’
ఈ పార్క్ తమ సొంత ఇంటిగా చీతాలు చేసుకుంటాయని వెల్లడించిన ప్రధాని మోదీ
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి