SpiceJet Offers: విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. అదిరిపోయే ఆఫర్‌.. 30 శాతం డిస్కౌంట్‌

ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ తాజాగా ప్రయాణికులకు మంచి ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అన్ని దేశీ విమానాలపై 30 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ..

|

Updated on: Jun 04, 2021 | 1:56 PM

ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ తాజాగా ప్రయాణికులకు మంచి ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అన్ని దేశీ విమానాలపై 30 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ కేవలం కొంత మందికే వర్తిస్తుంది. సర్టిఫైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్‌కు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

1 / 4
కరోనాతో పోరాడుతూ ప్రజలకు సేవలు అందిస్తున్న హెల్త్ కేర్ వర్కర్లకు విమాన టికెట్ల బేస్ ఫేర్‌లో 30 శాతం తగ్గింపు అందించనుంది. అయితే ఈ ఆఫర్‌ వర్తించాలంటే ముందుగా  ప్రొఫెషనల్ ఐడీ, రిజిస్ట్రేషన్ నెంబర్ వంటివి సమర్పించాల్సి ఉంటుంది. టికెట్ బుకింగ్ సమయంలో ఈ వివరాలు అందిస్తే సరిపోతుంది.

2 / 4
అలాగే చెకిన్, బోర్డింగ్ సమయంలో కూడా ఇదే ఐడీ వివరాలు అందించాల్సి ఉంటుంది. ఇకపోతే ఎయిర్‌పోర్ట్ యూసేజ్ చార్జీలు, ట్యాక్సులు వంటివి మాత్రం చెల్లించాలి. ఈ ఆఫర్ సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. విమాన ప్రయాణం చేసే హెల్త్ కేర్ వర్కర్లకు ఈ ఆఫర్ వల్ల బెనిఫిట్ ఉంటుంది.

3 / 4
ప్రయాణికులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, స్టేట్ మెడికల్ కౌన్సిల్, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ వంటి ప్రభుత్వ సంస్థలు జారీ చేసే ఐడీ కార్డు ఉంటే సరిపోతుంది. ఒకవేళ ఈ డాక్యుమెంట్లు లేకపోతే అప్పుడు సాధారణ చార్జీలే వర్తిస్తాయి.

4 / 4
Follow us