Jio Broadband: జియో బంపర్‌ ఆఫర్‌.. చిన్న వ్యాపారులకు అతి తక్కువ ధరకే జియో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు

Jio Broadband: రిలయన్స్‌ జియో కస్టమర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది....

|

Updated on: Mar 10, 2021 | 2:42 PM

Jio Broadband: రిలయన్స్‌ జియో కస్టమర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పటికే ఎంతో మందిని ఆకట్టుకున్న జియో ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లను వినియోగదారుల ముందుకు తీసుకువస్తోంది. ఇక సూక్ష్మ, చిన్న , మధ్య తరహా వ్యాపార సంస్థలకు (ఎంఎస్‌ఎంబీ)తక్కువ ధరకే బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందిస్తున్నట్లు రిలయన్స్‌ జియో ప్రకటించింది. సెకండ్‌కు 100 మెగాబిట్‌ అప్‌లోడ్‌ సామర్థ్యంతో అన్‌లిమిటెడ్‌ వినియోగ అవకాశం గల ప్లాన్‌ రూ.901కే అందుబాటులో ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపింది.

1 / 3
Jio Broadband: ప్రస్తుతం ఎంఎస్‌ఎంబీలు కనెట్టివిటీ, ప్రోడక్టివిటీ, ఆటోమేషన్‌ పరికరాలపై నెలకు రూ.15,000 నుంచి రూ.20,000 వరకు ఖర్చు చేస్తున్నాయంటూ వారికి మార్కెట్‌ ధర కన్నా 10 శాతం ధరకే ఈ సేవలు అందుబాటులోకి తెస్తున్నామని తెలిపింది. అయితే వారి సాధికారత దిశగా తొలి అడుగు అని జియో డైరెక్టర్‌ ఆకాశ్‌ అంబానీ తెలిపారు.

2 / 3
Jio Broadband: అలాగే రూ.5000 ధరకే దూర ప్రదేశం నుంచే ఉద్యోగుల పర్యవేక్షణ, వీడియో కాన్ఫరెన్సింగ్‌, డివైస్‌ యాజ్‌ ఏ సర్వీస్‌ సేవలు అందిస్తామని తెలిపారు. దీంతో భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి ఎంఎస్‌ఎంబీలు ఆత్మనిర్భర్‌ డిజిటల్‌ ఇండియా దిశగా పయనం సాగించగలుగుతాయని అన్నారు. తొలి దశలో 5 కోట్ల  ఎంఎస్‌ఎంబీ కస్టమర్లను సాధించాలన్నది తమ లక్ష్యమని ఆయన తెలిపారు. 100 ఎంబీపీఎస్‌ నుంచి 1 జీబీపీఎస్‌ వేగంతో కూడిన రూ.901 నుంచి రూ.10,001 శ్రేణితో ఏడు టారిఫ్‌ ప్లాన్లను కంపెనీ ఈ సందర్భంగా విడుదల చేసింది.

3 / 3
Follow us