BAN vs SL: బంగ్లాదేశ్‌ జట్టులో కరోనా కలకలం.. వైరస్‌ బారిన పడిన స్టార్‌ ఆల్‌రౌండర్‌..

BAN vs SL: బంగ్లాదేశ్‌-శ్రీలంక మధ్య మే 15 నుంచి రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభం కానుంది. అయితే అంతకుముందే ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ సమస్యలు ఆతిథ్య జట్టును ఇబ్బందుల్లోకి నెట్టాయి.

|

Updated on: May 10, 2022 | 9:56 PM

షకీబ్‌తో పాటు, స్పిన్నర్లు మెహదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్‌ల సేవలను కూడా బంగ్లాదేశ్‌ జట్టు కోల్పోనుంది. భుజం గాయం కారణంగా టెస్ట్‌ మ్యాచ్‌కు తస్కిన్‌ దూరమయ్యాడు. మరోవైపు ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాతే షోరీఫుల్ ఇస్లాంకు కూడా అవకాశం దక్కనుంది.

1 / 5
శ్రీలంకతో కీలక టెస్టు సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్‌కు ఎదురుదెబ్బలు తగిలాయి. ఆ జట్టు స్టార్‌ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. జట్టులో చేరడానికి ముందే, షకీబ్ కరోనా వైరస్ బారిన పడ్డాడు. దీంతో ప్రస్తుతం అతను ఐసోలేషన్‌లో ఉండిపోయాడు

2 / 5
మే 15 నుంచి ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌కి ముందు కూడా కొంతమంది కీలక ఆటగాళ్ల గాయాల బారిన పడడం బంగ్లాదేశ్‌ను ఇబ్బందుల్లోకి నెట్టాయి. తాజాగా షకీబ్ రూపంలో బంగ్లాదేశ్‌కు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అంతకుముందు దక్షిణాఫ్రికా పర్యటనకు కూడా షకీబ్‌ దూరమయ్యాడు.

3 / 5
క్రికెట్ వెబ్‌సైట్ ESPN- క్రిక్‌ఇన్‌ఫో నివేదిక ప్రకారం, షకీబ్ బుధవారం జట్టులో చేరాల్సి ఉంది.  అయితే దీనికి ముందు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో అతనికి పాజిటివ్‌గా తేలింది.

4 / 5
బంగ్లా దేశ్‌ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ షకీబ్ అల్ హసన్ కొవిడ్‌ 19 బారిన పడడంతో మొదటి టెస్ట్‌ మ్యాచ్‌కు దూరం కానున్నాడు.

5 / 5
Follow us